Site icon NTV Telugu

Trump effect: అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ రాజీనామా

Trumpeffect

Trumpeffect

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి బాధ్యత వహిస్తూ అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ చీటిల్ రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీనికి సీక్రెట్ సర్వీస్ చీఫ్ బాధ్యత వహించింది. భద్రతా లోపానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2022 నుంచి సీక్రెట్ ఏజెన్సీకి చీటిల్ సారథ్యం వహిస్తున్నారు. ట్రంప్‌పై దాడి తర్వాత రాజీనామా చేయాలంటూ కాల్స్ వస్తున్నాయన్నారు.

ఇది కూడా చదవండి: Dharmendra Pradhan: సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..ఏమన్నారంటే..?

డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని నిరోధించే లక్ష్యంలో ఏజెన్సీ విఫలమైందని సోమవారం చీటిల్ అంగీకరించారు. మొత్తానికి ఒక రోజు తర్వాత సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ మంగళవారం రాజీనామా చేశారు. జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో రిపబ్లికన్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైట్ హౌస్ అభ్యర్థి ట్రంప్‌పై 20 ఏళ్ల ముష్కరుడు గాయపరచడంతో చీటిల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పని వారం క్రితమే చేసి ఉండాల్సిందని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాల సీక్రెట్ సర్వీస్ కాలంలో ఈ ఘటన వైఫల్యం చెందిందని వెల్లడించారు.

ట్రంప్ ప్రచార కార్యక్రమంలో ప్రసంగించడం ప్రారంభించిన కొద్ది నిమిషాలకే AR తరహా రైఫిల్‌తో దుండగుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. సమీపంలోని భవనం పైకప్పుపై కూర్చున్న అతను ఎనిమిది షాట్లలో కాల్పులు జరిపాడు. అనంతరం 30 సెకన్లలోపు సీక్రెట్ సర్వీస్ చేత కాల్చి చంపబడ్డాడు. ర్యాలీకి హాజరైన వారు గాయపడ్డారు. ఒకరు ప్రాణాలు వదిలారు.

చీటిల్ 27 సంవత్సరాల పాటు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా పనిచేశారు. 2021లో పెప్సికోకి ఉత్తర అమెరికాలో సెక్యూరిటీ హెడ్‌గా మారారు. అనంతరం 2022లో ప్రెసిడెంట్ జో బిడెన్ ఆమెను ఏజెన్సీకి అధిపతిగా నియమించారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ మరో రికార్డు

Exit mobile version