US pilot rescue Op: సినిమాకు ఏం తక్కువ కాదు.. ఇరాన్‌లో యూఎస్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్స్..
- అమెరికన్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..
- ఇరాన్ భూభాగం నుంచి సజీవంగా రక్షించిన స్పెషల్ ఫోర్సెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US pilot rescue Op: ఇరాన్‌లో అమెరికన్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ సంచలనంగా మారింది. శత్రుదేశ భూభాగంలో అతడిని రక్షించిన విధానం సినిమాకు తక్కువేం కాదు. ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూల్చేసి ఇరాన్ విజయం సాధించిందని భావించింది, పైలట్లను సజీవంగా పట్టుకోవాలని చూసింది. కానీ, అమెరికా వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. విమానం కూలిన తర్వాత వెంటనే ఒక పైలట్‌ను కొన్ని గంటల్లోనే రెస్క్యూ చేశారు. మరో పైలట్ కోసం తీవ్రంగా గాలించారు.
రంగంలోకి స్పెషల్ ఫోర్సెస్:
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాము పైలట్‌ను రక్షించామని చెప్పారు. అతడిని తీసుకురావడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఆయుధాలను కలిగిన డజన్ల కొద్దీ విమానాలను పంపించామని, అతడిని రక్షించామని వెల్లడించారు. ఈ రెస్క్యూ కోసం వందలాది మంది స్పెషల్ ఫోర్సెస్ పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ కోసం అమెరికా బలగాలు HH-60W ‘జాలీ గ్రీన్ II’ రెస్క్యూ హెలికాప్టర్లు, A-10 వార్‌హాగ్ అటాక్ జెట్‌లు, ఒక HC-130 రెస్క్యూ మిడ్-ఎయిర్ ట్యాంకర్, సుదూర పరిధిలో పనిచేసే F-35 స్టెల్త్ జెట్‌లు, ప్రత్యేక దళాలు మరియు ఒక కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రత్యేక విభాగాన్ని ఉపయోగించినట్లు సమాచారం. అమెరికా ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (CSAR) హెలికాప్టర్ అయిన సికోర్స్కీ HH-60W ‘జాలీ గ్రీన్ II’ను ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా మారింది. సుదూర ప్రయాణాలు, అత్యాధునిక సెన్సార్లు ఇందులో ఉన్నాయి.
రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరిగింది.?
శుక్రవారం విమానం నుంచి కిందకు దూకిన తర్వాత F-15 పైలట్ మరియు వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ ఇద్దరూ తమ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా ఒకరితో ఒకరు సంప్రదించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఇరాన్ ఒక అమెరికన్ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌పై దాడి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ జరిగింది.
పైలట్ గురించి ముందుగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) ఇరాన్‌లో ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది. అమెరికా దళాలు అతన్ని అప్పటికే కనుగొన్నాయని, భూమార్గం ద్వారా సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని ఆ ప్రచారం చేసినట్లు యాక్సియోస్ నివేదిక వెల్లడించింది. నేలపై దిగిన తర్వాత పైలట్ స్థానిక కొండల్లో వెళ్లి దాక్కున్నాడు. అతని వద్ద కేవలం చిన్న పిస్టల్ మాత్రమే ఉంది. జీపీఎస్, డిస్ట్రెస్ బీకన్ ద్వారా అమెరికా సైన్యంతో అతను కాంటాక్ట్ అయ్యారు.
ఇదే సమయంలో పైలట్ కోసం ఇరాన్ తీవ్రంగా వెతకడం ప్రారంభించింది. అమెరికా సైన్యం అతడిని ముందుగా రెస్క్యూ చేయాలని భావిస్తుంటే, ఇరాన్ సైన్యం అతడిని పట్టుకోవాలని అనుకుంది. రెస్క్యూ జరుగుతున్న సమయంలో అమెరికా విమానాలు ఇరాన్ కాన్వాయ్‌లు పైలట్ ఉన్న ప్రాంతానికి రాకుండా బాంబులు వేశాయి. శత్రువులను దూరంగా ఉంచేందుకు ఫైరింగ్ ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర యుద్ధం నడిచింది. రాత్రి సమయంలో పైలట్ ఉన్న ప్రాంతానికి కమాండోలు ప్రవేశించారు, ఓ వైపు తీవ్రంగా కాల్పులు జరుగుతున్నప్పుడు అతడిని ప్రాణాలతో రక్షించారు. గాయాలైనప్పటికీ పైటల్ సురక్షితంగా ఉన్నాడు. రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఇద్దరు పైలట్లను రక్షించడం అమెరికా చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..