US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
- అత్యంత కీలకంగా మారిన అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు..
- మూడు సర్వేల్లో ట్రంప్ పార్టీకి ఎదురుగాలి..
- డెమోక్రాట్లు ఆధిక్యం సాధిస్తారని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Midterm Elections 2026: అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత సాధిస్తేనే కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభ, సెనెట్‌లో ఇబ్బందులు ఉండవు. డెమోక్రాట్లు విజయం మెజారిటీ సాధిస్తే బిల్లుల విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ ఎన్నికల్ని ట్రంప్ పాలనపై రెఫరెండంగా చూస్తున్నారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలతో పాటు సెనేట్‌లోని 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకూ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
ట్రంప్‌కు సర్వేల షాక్..
ఎన్నికలకు ముందు వెలువడిన మూడు సర్వేలు ట్రంప్‌కు షాక్ ఇస్తున్నాయి. మూడింటిలో డెమోక్రాట్లకు ఆధిక్యత వస్తుందని అంచనా వేశాయి. జాన్ జోగ్బీ స్ట్రాటజీస్ నవంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించిన సర్వేలో డెమోక్రాట్లకు 53 శాతం, రిపబ్లికన్లకు 47 శాతం మద్దతు లభించింది. అక్టోబర్ 30న వెలువడిన యూగోవ్ సర్వేలో డెమోక్రాట్లకు 53 శాతం, రిపబ్లికన్లకు 44 శాతం మద్దతు నమోదైంది. పొలిటీఐక్యూ జాతీయ పోలింగ్ సగటులో డెమోక్రాట్లకు 52.7 శాతం, రిపబ్లికన్లకు 43.2 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడైంది. ఈ మూడు సర్వేల్లో డెమోక్రాట్ల ఆధిక్యం 6 నుంచి 9.5 శాతం పాయింట్ల మధ్య ఉంది.
Also Read
- NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
- Pakistan: ముస్లింలకు ముప్పుగా "హిందూ-యూదు కూటమి".. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
- Florida Plane Crash: ఫ్లోరిడా ప్లేన్ క్రాష్.. లవర్‌కు పైలట్ చివరి మెసేజ్.. టెక్ వ్యాపారవేత్త కుటుంబం దుర్మరణం..
- Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
రెండు సభల్లో నియంత్రణ కీలకం..
అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిదుల సభక మొత్తం 435 మంది ఎన్నికవుతారు. సెనేట్‌లో 100 స్థానా్లో ప్రతీ రెండేళ్లకు సుమారు మూడో వంతు స్థానాలకు ఎన్నికలు జరుతాయి. ఈ సారి 35 సెనెట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 53 స్థానాలు ఉండగా, డెమోక్రాట్లు+స్వతంత్రులు కలుపుకుని 47 మంది ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 35 స్థానాల్లో ప్రస్తుతం 22 స్థానాలు రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్నాయి. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ ఉంది. ప్రతినిధుల సభలో పట్టు సాధించేందుకు డెమోక్రాట్లకు మరో మూడు స్థానాలు, సెనెట్‌లో మరో నాలుగు స్థానాలు అవసరమని అంచనా.
డెమోక్రాట్లు ఏదైనా ఒక సభలో ఆధిక్యత సాధించినా ట్రంప్ ప్రభుత్వం చేసే చట్టాలు, విధానాల అమలులో ప్రతిపక్షం నుంచి సవాళ్లు ఎదురవ్వడం ఖాయం. రిపబ్లికన్లు మెజారిటీ సాధిస్తేనే మరో రెండేళ్లు ట్రంప్ హాయిగా పాలన చేసుకోవచ్చు.
ద్రవ్యోల్బణం, ఇరాన్ యుద్ధం ప్రభావం..
అమెరికాలో సుమారు 21 కోట్ల మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ద్రవ్యోల్బణం, ఇరాన్ యుద్ధం అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. నిత్యావసర ధరలు, ఇంధన ధరలు పెరగడంపై సగటు అమెరికన్ ఆగ్రహంతో ఉన్నాడు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి, అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఇరాన్ యుద్ధంలో అమెరికా పూర్తిస్థాయిలో గెలవలేదు. హార్ముజ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!