YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం లేకుండా చేసి కూటమి విజయం సాధించిందని ఆరోపించారు. ఇవి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు కావని, కేవలం అభ్యర్థులను ఎంపిక చేసుకునే ప్రక్రియగా మారిపోయాయని ధ్వజమెత్తారు.
చంద్రబాబు నాయుడి టీమ్, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసిన జగన్.. ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశమే లేకుండా చేసి ఎన్నికల్లో ఘన విజయం ఎలా సాధించాలో నిరూపించారని విమర్శించారు. దేశంలో ఎన్నికల సంస్కరణల అవసరం ఇంతకంటే స్పష్టంగా మరెప్పుడూ కనిపించలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల సంస్కరణలు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
Also Read
- CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
- CM Chandrababu: తుఫాన్‌ను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
- AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలే..
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. నామినేషన్ దశను హైజాక్ చేశారని, నామినేషన్ల పరిశీలనలోనూ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారని విమర్శించారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడమే కాకుండా, కొందరిని బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు. పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగాయని, పోలింగ్ శాతాన్ని తారుమారు చేశారని అన్నారు. చివరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా హైజాక్ చేశారని తన ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రజలు ఎన్నుకోలేదు.. మీరే అభ్యర్థులను ఎంపిక చేశారు
అభ్యర్థులను అధికారంలో ఉన్నవారే ఎంపిక చేసుకున్నారని, ప్రజలు ఎన్నుకోలేదని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం కల్పించకుండా ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారని ఆరోపించారు. అందుకే ప్రస్తుత ఎన్నికలను ఎన్నికలుగా కాకుండా కేవలం సెలక్షన్లుగా మాత్రమే భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఇక, తన ట్వీట్‌కు #CBNJungleRaj అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ఎన్నికల సంస్కరణల అవసరాన్ని మరోసారి ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ట్యాగ్ చేస్తూ (ట్వీట్) ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP— YS Jagan Mohan Reddy (@ysjagan) November 3, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!