Site icon NTV Telugu

Iran Protests: “ఒక్కరు చనిపోయినా, అమెరికా రెడీగా ఉంది”.. ఇరాన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్..

Iran Protest

Iran Protest

Iran Protests: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని సిటీల్లో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ‘‘ముల్లాలు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’ అంటూ ఖమేనీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ద్రవ్యోల్భణం, ఆర్థిక సంక్షోభంపై రోడ్లపైకి వచ్చిన ప్రజలు, ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ రాజీనామా చేశారు.

Read Also: S Jaishankar: ‘‘చెడ్డ పొరుగువారు’’.. పాకిస్తాన్‌పై దాడి చేసే హక్కు భారత్‌కు ఉంది..

ఇదిలా ఉంటే, ఇరాన్ నిరసనలకు, ప్రజలకు అమెరికా, ఇజ్రాయిల్ మద్దతు తెలిపాయి. ట్రంప్ ఒకడుగు ముందుకు వేసి తీవ్రస్థాయిలో ఇరాన్‌ను హెచ్చరించారు. ట్రూత్ సోషల్ పై ఒక పోస్ట్ లో ట్రంప్ హెచ్చరికలు చేశారు. “ఇరాన్ శాంతియుత నిరసనకారులను కాల్చి చంపితే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారిని కాపాడుతుంది. అమెరికా లాక్డ్, లోడెడ్ అండ్ రెడీ టూగో స్థితిలో ఉంది ” అని ఇరాన్‌పై దాడులు చేస్తామని పరోక్షంగా హెచ్చరికలు పంపారు. మహ్సా అమిని హత్య తర్వాత, మూడేళ్లకు ఇరాన్‌లో మరోసారి నిరసనలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ రియాల్ పతనం తర్వాత అక్కడ ఆర్థిక సంక్షోభం శిఖరానికి చేరింది. నిరసనల్లో అశాంతి వ్యాపించడంతో అనేక మంది మరణించినట్లు ఇరాన్ మీడియా, హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

అయితే, అమెరికా హెచ్చరికలపై ఇరాన్ స్పందించింది. ప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారు అలీ లారిజాని శుక్రవారం ఇరాన్ నిరసనలలో అమెరికా జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతటా గందరగోళం ఏర్పడుతుందని అన్నారు. ఇరాన్ శాంతియుత ప్రదర్శనకారులపై ప్రాణాంతక శక్తిని ప్రయోగిస్తే వాషింగ్టన్ జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. ఓ వైపు నిరసనల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూనే, ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు.

Exit mobile version