US-Iran: ఇరాన్-అమెరికా మధ్య ప్రధాన డిమాండ్లు ఇవే! చర్చలు కొలిక్కి వచ్చేనా?
- ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ కీలక సమావేశం
- అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు
- పాక్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య చర్చలు ప్రధాన డిమాండ్లపై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్ మధ్య కీలక సమావేశం జరగబోతుంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో ఇరాన్ నుంచి ఆరుగురు, అమెరికా నుంచి నలుగురు, పాకిస్థాన్ నుంచి నలుగురు బృందం చర్చల్లో పాల్గొనున్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
డిమాండ్లు ఇవే..
లెబనాన్‌పై దాడులు ఆపేయాలని.. అలాగే అమెరికా స్తంభింపజేసిన బిలియన్ల డాలర్ల ఇరాన్ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుండగా.. యురేనీయం శుద్ధిని ఆపేయాలని.. అలాగే హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. హార్ముజ్‌ను అడ్డం పెట్టుకుని ప్రపంచ దేశాల నుంచి డబ్బు వసూలు చేయడాన్ని అమెరికా తప్పుపడుతోంది.
Also Read
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..

ఇరాన్ నుంచి..
ఇరాన్‌కు చెందిన ఆరుగురు ప్రముఖులు చర్చల్లో పాల్గొననున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ చర్చలకు నేతృత్వం వహించనున్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇరాన్ సుప్రీం నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యదర్శి అలీ అక్బర్ అహ్మదీన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్నాసర్ హెమ్మతి ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. సీనియర్ దౌత్యవేత్త మజీద్ తఖ్త్ రవాంచి , భద్రతా నిపుణుడు మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ కూడా ఈ చర్చల్లో భాగమవుతారని ఇరాన్ పేర్కొంది.
ఇక ఇరాన్ ప్రతినిధి బృందానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. ఇటీవల అమెరికా దాడుల్లో 168 మంది పాఠశాల విద్యార్థులు చనిపోయారు. దీంతో ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ పాకిస్థాన్‌కు చేరుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫొటోను పంచుకున్నారు. ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది చిన్నారులు మరణించిన ఘటనకు గుర్తుగా విమానంలోని ఫొటోను పంచుకున్నారు. పిల్లలకు నివాళులర్పిస్తూ… అంతర్జాతీయ వేదికపై ఆ ఘటనను గుర్తుచేసుకుంది.

అమెరికా నుంచి.
ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు నలుగురు ప్రముఖ అమెరికా వ్యక్తులు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ట్రంప్ అల్లుడు, మాజీ సలహాదారు జారెడ్ కుష్నర్, మధ్యప్రాచ్య ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ కూడా ఈ శాంతి చర్చలకు హాజరవుతున్నారు.
పాకిస్థాన్ నుంచి
శాంతి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నందున పలువురు కీలక అధికారులు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ భద్రతా సలహాదారు మహమ్మద్ అసిమ్ మాలిక్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
ట్రంప్ వార్నింగ్..
ఇదిలా ఉంటే చర్చలకు ముందు ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకర దాడులు ఉంటాయని.. ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా? దాడులా? అన్నది 24 గంటల్లో తేలిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు.

తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..