Site icon NTV Telugu

Iran-Israel: మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య టెన్షన్.. అణు కేంద్రాలపై దాడికి ఐడీఎఫ్ ప్లాన్!

Iranisrael

Iranisrael

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు గాజాపై విరుచుకుపడుతున్న ఐడీఎఫ్ దళాలు.. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్‌తో అగ్ర రాజ్యం అమెరికా అణు ఒప్పందంపై కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఇజ్రాయెల్ దాడులకు సిద్ధపడుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఐడీఎఫ్ దళాలు దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ సూచించింది. అయితే దాడులపై ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకున్నారో లేదో స్పష్టం చేయలేదని నివేదికలు పేర్కొన్నాయి. ఒక ప్రణాళికతోనే ఇజ్రాయెల్ దాడులకు దిగుతున్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అది జరిగితే అమెరికా చర్చలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Spy Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం.. వెలుగులోకి కీలక విషయాలు

ఇదిలా ఉంటే అమెరికా నిఘా సంస్థ హెచ్చరికలపై వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు. అమెరికా నుంచి ప్రకటన వచ్చి ఇన్ని గంటలు అవుతున్నా.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం కూడా స్పందించకపోవడం విశేషం.

ఇది కూడా చదవండి: Akhanda 2 : బాలయ్యతో క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న బోయపాటి ?

ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ట్రంప్ పరిపాలన.. ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది. అణు ఒప్పందంపై దౌత్యపరమైన ఒప్పందాన్ని సాధించే లక్ష్యంతో అమెరికా ప్రయత్నిస్తోంది. ఇంతలోనే ఇజ్రాయెల్ దాడులకు సిద్ధపడుతోంది. ఇదిలా ఉంటే మంగళవారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. అణు ఒప్పందంపై చర్చలు విజయవంతం అవుతాయా? లేదా అనే దానిపై సందేహాలు వ్యక్తం చేశారు.

గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన  సమయంలో ఇరాన్ జోక్యం చేసుకుంది. వందల కొద్ది క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. వాటిని ఐడీఎఫ్ దళాలు తిప్పికొట్టాయి. అనంతరం ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. మరోసారి అదే తరహాలో దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచించింది.

Exit mobile version