Trump Tariffs: ట్రంప్‌కి షాక్.. ఆ సుంకాలు చట్ట విరుద్ధమని కోర్టు ఫైర్
- డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కి షాక్ ఇచ్చిన కోర్టు..
- టారిఫ్‌ల పెంపు చట్ట విరుద్ధమని పేర్కొన్న న్యాయస్థానం..
- పెంచిన సుంకాలను అక్టోబర్ నెల మధ్య నాటికి ఆపేయాలి: కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariffs: సుంకాల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ట్రంప్ విధించిన టారిఫ్‌లు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు వెలువరించింది. యూఎస్ అధ్యక్షుడు తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి ఎక్కువ సుంకాలను పెంచినట్లు చెప్పుకొచ్చింది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు ఇచ్చింది. భారీగా విధించిన పన్నులు పలు దేశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి జడ్జిలు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అప్పీల్ల కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాటం చేయనున్నారు.
Read Also: HYD Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో సేవలు పొడిగింపు..
Also Read
అయితే, ఈ నిర్ణయంపై కోర్టును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అన్ని దేశాలపై విధించిన టారీఫ్స్ ప్రస్తుతం అమల్లో ఉండగా.. వాణిజ్య భాగస్వాములపై వేసిన సుంకాలను తొలగించాలని అప్పీళ్ల కోర్టు పక్షపాతంగా తీర్పు ఇచ్చిందని ఆరోపించారు. ఈ ప్రక్రియలో చివరకు యూఎస్ విజయం సాధిస్తుంది.. ఒకవేళ ఈ టారిఫ్‌లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు ఏర్పడుతుందన్నారు. దేశం మరింత బలపడాలంటే.. సుంకాల పెంపు ఉండాల్సిందే.. లేదంటే, ఆర్థికంగా బలహీనపడిపోతుందన్నారు. యూఎస్ వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి ఈ పన్నులు విధించినట్లు పేర్కొన్నారు. మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్ర దేశాలైనా, శత్రుదేశాలైనా అనైతికంగా విధించే టారిఫ్‌లను అమెరికా సహించదని ట్రంప్ వెల్లడించారు.
Read Also: Off The Record : టీడీపీ వర్సెస్ జనసేన పోయి.. జనసేన వర్సెస్ జనసేన
ఇక, ఒక వేళ టారిఫ్‌లను ఎత్తివేసే నిర్ణయం అమెరికాను తీవ్రంగా నాశనం చేస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. మన కార్మికులకు సాయం చేయడానికి ఇదొక్కటే మార్గం అన్నారు. యూఎస్ ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు సపోర్టుగా ఉండాలి.. చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు సుంకాలను మనకు వ్యతిరేకంగా ఉపయోగించారని తెలిపారు. యూఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్‌లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అగ్రరాజ్యాన్ని బలమైన, ధనిక, శక్తివంతంగా మారుస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!