కరోనా మహమ్మారి వివిధ రకాలుగా మ్యూటేషన్ చెంది బలమైన వేరియంట్‌లుగా మార్పులు చెంది వైరస్‌ను వేగంగా విస్తరింపజేస్తున్నాయి. వైరస్ కట్టడికి వ్యాక్సిన్‌లు తీసుకొచ్చినా, వాటికి లొంగకుండా తప్పించుకొంటూ రోగాలను కలిగిస్తున్నాయి. కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లాభం ఉండటం లేదు. వైరస్‌ల ఆట కట్టించేందుకు ఆమెరికాలోని యూనివర్శిటి ఆఫ్ కొలరాడో బౌల్టర్ విశ్వవిద్యాలయం వినూత్నమైన పరిశోధనలు చేసింది. యాంటీబాడీల నుంచి తప్పించుకొంటున్న కరోనా, హెచ్ఐవీ, ఇన్‌ఫ్లూయెంజా వంటి వైరస్‌లను కట్టడి చేసేందుకు నూతన విధానాన్ని అభివృద్ధి చేశారు. వంటల్లో వినియోగించే ఈస్ట్‌ను జన్యుపరంగా మార్పులు చేసి అందులో వైరస్ స్పైక్ ప్రోటీన్ ఉంచి ప్రత్యేక ట్యూబుల ద్వారా పరిశీలించగా ఆసక్తికరమైన విషయాలును గుర్తించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా వైరస్‌లో చోటుచేసుకోబోయే మ్యూటేషన్లను ముందుగానే గుర్తించవచ్చని, బూస్టర్ డోసులను తయారు చేసేందుకు ఈ పద్దతి ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: అవి చూస్తే.. తెలియకుండానే భయపడుతున్నా: లావణ్య త్రిపాఠి