కరోనా మహమ్మారి వివిధ రకాలుగా మ్యూటేషన్ చెంది బలమైన వేరియంట్‌లుగా మార్పులు చెంది వైరస్‌ను వేగంగా విస్తరింపజేస్తున్నాయి. వైరస్ కట్టడికి వ్యాక్సిన్‌లు తీసుకొచ్చినా, వాటికి లొంగకుండా తప్పించుకొంటూ రోగాలను కలిగిస్తున్నాయి. కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లాభం ఉండటం లేదు. వైరస్‌ల ఆట కట్టించేందుకు ఆమెరికాలోని యూనివర్శిటి ఆఫ్ కొలరాడో బౌల్టర్ విశ్వవిద్యాలయం వినూత్నమైన పరిశోధనలు చేసింది. యాంటీబాడీల నుంచి తప్పించుకొంటున్న కరోనా, హెచ్ఐవీ, ఇన్‌ఫ్లూయెంజా వంటి వైరస్‌లను కట్టడి చేసేందుకు నూతన విధానాన్ని అభివృద్ధి చేశారు.…