Site icon NTV Telugu

Ukraine Russia War: శాంతి చర్చల్లో కీలక పరిణామం.. రంగంలోకి ఐరాస..

Un Chief Antonio Guterres

Un Chief Antonio Guterres

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్‌ బలగాల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా.. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతోంది రష్యా సైన్యం.. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్‌ మధ్య పలు దపాలుగా జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు.. ఈ నెలలోనే రెండు దేశాల్లో పర్యటించబోతున్నారు.

Read Also: Summer Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 6 నుంచి సమ్మర్‌ హాలిడేస్‌

యుద్ధం చేస్తోన్న రెండు దేశాల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పర్యటన ఖరారైంది.. మొదట ఈ నెల 26వ తేదీన రష్యాలో పర్యటించనున్న ఆయన.. ఆ తర్వాత 28వ తేదీన ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు.. తన పర్యటనపై ఇప్పటికే రెండు దేశాలకు లేఖలు రాసింది ఐక్యరాజ్యసమితి.. అయితే, ఈ పర్యటనలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీతో వేర్వేరుగా చర్చలు జరపబోతున్నారు. అంతేకాదు.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతోనూ సమావేశం కానున్నారు.. రెండు దేశాల అధికారుల మధ్య ఇప్పటికే పలు దపాలుగా జరిగిన చర్చలు విఫలం కాగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version