Ban Social Media for Children Under 16: అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రధాని సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ban Social Media for Children Under 16: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు. పిల్లలను డిజిటల్ వ్యసనం, అనుచిత కంటెంట్ మరియు ఇతర ఆన్లైన్ ప్రమాదాల నుంచి రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. పలు పెద్ద టెక్నాలజీ కంపెనీలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు ప్రధాని కీర్ స్టార్మర్. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు స్మార్ట్ఫోన్లు మరియు సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారని తన దృష్టికి తీసుకొచ్చారని ఆయన చెప్పారు. పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారని, వారిని సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు. “నేటి ప్రపంచంలో సాంకేతికత పిల్లల జీవితంలోని ప్రతి అంశంలోకి చొచ్చుకుపోయింది. ఇది ఇకపై కొనసాగకూడదు. అందుకే పిల్లలకు వారి బాల్యాన్ని తిరిగి ఇవ్వడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం” అని కీర్ స్టార్మర్ తన సందేశంలో పేర్కొన్నారు.
Also Read
- Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
- Pakistan Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది కార్మికులు మృతి
- ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
- US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా దాడులు..
ఇదిలా ఉండగా, పిల్లల భద్రత విషయంలో బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల టెక్ కంపెనీలపై ఒత్తిడిని పెంచింది. సోషల్ మీడియా వేదికల్లో వయస్సు ధృవీకరణ వ్యవస్థను తప్పనిసరి చేయాలని, పిల్లలకు హానికరమైన కంటెంట్‌ను తగ్గించేలా అల్గారిథమ్‌లలో మార్పులు చేయాలని సూచించింది. అలాగే అశ్లీల మరియు అనుచిత కంటెంట్ నుంచి చిన్నారులను రక్షించేందుకు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాకుండా, పిల్లల కోసం రూపొందించిన ఆన్లైన్ గేమింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో లైవ్ స్ట్రీమింగ్ సేవలపై కూడా ఆంక్షలు విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యల ద్వారా పిల్లల మానసిక ఆరోగ్యం, విద్య మరియు సామాజిక అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గత ఏడాది ఆస్ట్రేలియా కూడా టీనేజర్లు మరియు పిల్లల కోసం సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేసింది. ఆ నిర్ణయాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు ప్రశంసించాయి. తాజాగా కెనడా కూడా పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..
తాజావార్తలు
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్‌పై కేసు నమోదు..
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
-
World Cup 2027: వరల్డ్ కప్‌లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!