PM Modi: యూఏఈలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీ పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి తరలివెళ్లారు. అబుదాబిలో కాలుమోపిన ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ విమానాశ్రయానికి విచ్చేసి ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. మోదీని ఆలింగనం చేసుకుని తమ సుహృద్భావాన్ని ప్రదర్శించారు.
యూఏఈ అధ్యక్షుడి ఘనస్వాగతం పట్ల ప్రధాని మోదీ పొంగిపోయారు. “నా సోదరుడు, రారాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతించడం నన్ను కదిలించివేసింది. ఆయనకు నా కృతజ్ఞతలు” అంటూ ప్రధాని మోదీ ట్వటర్ వేదికగా వెల్లడించారు. కాగా, మోదీ తన యూఏఈ పర్యటనలో భాగంగా ఇటీవల దివంగతులైన యూఏఈ మాజీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు నివాళులు అర్పించారు
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
జర్మనీలో జరిగిన జీ-7 సమ్మిట్‌కు హాజరైన తర్వాత ప్రధాన మంత్రి అబుదాబికి చేరుకున్నారు. అక్కడ శిఖరాగ్ర సమావేశంలో అనేక మంది ప్రపంచ నాయకులతో సంభాషించారు. ప్రపంచ శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో చర్చించారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. మేలో మరణించిన షేక్ ఖలీఫా అల్ నహ్యాన్, నవంబర్ 2004 నుండి యూఏఈ అధ్యక్షుడిగా, అబుదాబి పాలకుడిగా పనిచేశారు. అతని మరణం అనంతరం షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన పర్యటనలో షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధాని మోదీ అభినందించనున్నారు. యూఏఈ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీతో సమావేశం కావడం ఇదే తొలిసారి.
I am touched by the special gesture of my brother, His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, of coming to welcome me at Abu Dhabi airport. My gratitude to him. @MohamedBinZayed pic.twitter.com/8hdHHGiR0z
— Narendra Modi (@narendramodi) June 28, 2022
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!