యాగి తుఫాన్ చైనాను హడలెత్తించింది. అత్యంత ప్రమాదకర స్థాయిలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. 234 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో మనుషులు, కార్లు కొట్టుకుపోయాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యాగి ప్రభావంతో వియత్నాం వణికిపోయింది. వదరలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 59కి చేరింది.