ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలే భార్య భర్తులు విడిపోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. పెద్ద మనుషులు వారికి సర్థి చెప్పినప్పటికి అర్థం చేసుకోకుండా కొందరు వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ ఓ వింత కేసు కేసు కోర్టుకు వచ్చింది. అదేమిటంటే.. భార్యను అవమానించేలా.. ఆమె ను నెంబర్ సేవ్ చేసుకున్నాడో భర్త.. నిజానిజాలు తెలుసుకున్నఅతడికి కఠిన శిక్షను విధించింది.
Read Also: Delhi Airport: ఎయిర్పోర్ట్లో మహిళపై అనుమానం… తనిఖీ చేసిన సిబ్బంది షాక్…
పూర్తి వివరాల్లోకి వెళితే.. టర్కీ దేశంలో దంపతుల మధ్య విభేదాలు వచ్చి.. భార్య తన భర్త నుంచి విడాకులు కావాలి, అతను తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ కోర్టులో కేసు వేసింది. ఆ తర్వాత భర్త కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ కోర్టులో విడాకుల కోసం అప్లై చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. భార్య లావుగా ఉండటంతో ఆమె అస్యహించుకునే భర్త, హేళన చేస్తూ ఆమెను వేధించేవాడు. అతని ఫోన్లో కూడా ఆమె పేరును బాడీ షేమింగ్ చేసేలా సేవ్ చేసుకున్నాడు.
Read Also:Elderly Man Beaten: అసలు వీడు.. మనిషా.. మృగమా… పెద్దమనిషని చూడకుండా…
కోర్టులో పూర్తి ఆధారాలతో.. భర్త నిజ స్వరూపాన్ని భయపెట్టింది భార్య. దీంతో అతను ఆమెను ఎంతగా వేధించాడో.. దీంతో ఆమె ఎంత మానసిక వేధన అనుభవిస్తుందో గ్రహించించి న్యాయస్థానం.. భర్త చేసిన అవిశ్వాస ఆరోపణ నిరాధారమైనదని తేల్చింది. ఆమెతో అక్రమ సంబంధం అంటగట్టిన వ్యక్తి కేవలం ఒక పుస్తకాన్ని అందించడానికి వచ్చాడని, వారి మధ్య ఎటువంటి ప్రేమ సంబంధం లేదని దర్యాప్తులో తేలింది. భర్త కావాలనే ఆమెను మానసికంగా, ఆర్థికంగా వేధించాడని భావిస్తూ అతని శిక్ష విధించింది.