NTV Telugu Site icon

Trump-Zelenskyy meet: రసాభాసగా ట్రంప్-జెలెన్స్కీ మీటింగ్.. తలపట్టుకున్న ఉక్రెయిన్ రాయబారి..

Makarova

Makarova

Trump-Zelenskyy meet: ఖనిజ ఒప్పందం, ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే, ఓవర్ ఆఫీస్‌లో ట్రంప్, జెలెన్క్కీ భేటీలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇది ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

భేటీ వాగ్వాదంతో ముగియడంతో అక్కడ ఉన్న అంతర్జాతీయ మీడియా విలేకరులతో పాటు ఇరు దేశాల దౌత్యవేత్తలు అసంతృప్తికి గురయ్యారు. ఈ భేటీ తర్వాత యుద్ధానికి అడ్డుకట్ట పడుతుందని ఆశించిన వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇరు నేతల మధ్య వాడీవేడీగా వాగ్వాదం జరుగుతున్న సమయంలో, అమెరికాలో ఉక్రెయిన్ రాయబారితో పాటు, ఉక్రెయిన్ దౌత్యవేత్తల ముఖాలు ఆవేశంగా కనిపించాయి.

ట్రంప్-జెలెన్స్కీ మధ్య ఘర్షణ తీవ్రమవుతుండగా దౌత్యవేత్త ఒక్సానా మార్కరోవా తల ఊపుతూ.. తలపట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖనిజ ఒప్పందంపై సంతకం చేయడానికి ట్రంప్, జెలెన్స్కీ ఓవర్ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు అగౌరవంగా ప్రవర్తించారని, మూడో ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. అతడికి శాంతి ఇష్టం లేదని అన్నారు. మరోవైపు, ట్రంప్ పుతిన్ అనుకూల వైఖరిని జెలెన్స్కీ ప్రశ్నించారు. అమెరికా హంతకుడితో రాజీ పడకూడదని అన్నారు. ఈ రసాభస నేపథ్యంలో ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ వెనుదిరిగారు.