ఇజ్రాయెల్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా తెలివి తక్కువ పని అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు బీహార్‌లో మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
వెస్ట్‌బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో రెండు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ పరిణామంపై అమెరికా మండిపడింది. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ముందుకు సాగితే మాత్రం వాషింగ్టన్ నుంచి అన్ని రకాల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు. ఈ మేరకు టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చర్య ఆమోదయోగ్యం కాదని.. గాజా శాంతి ఒప్పందం సమయంలో అరబ్ దేశాలకు తాను మాటిచ్చానని.. ఇలాంటి సమయంలో వెస్ట్‌బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే తాను ఇచ్చిన హామీలను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పుకొచ్చారు. అయినా కూడా వెస్ట్‌బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదని.. తాను ఇచ్చిన మాటను తప్పనని ట్రంప్ తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Bus Accident: కర్నూలు జిల్లాలో పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నిద్రలోనే మృత్యు ఒడికి ప్రయాణికులు..
ఇక ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇజ్రాయెల్ తీరును ఖండించారు. ఇజ్రాయెల్ తీరు చాలా తెలివితక్కువ పనిగా అభివర్ణించారు. వ్యక్తిగతంగా తాను అవమానంగా భావిస్తున్నానన్నారు. ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని అమెరికాకు వెళ్తుండగా టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో విలేకర్లతో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జేడీ వాన్స్ మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలోనే ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో వెస్ట్‌బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే బిల్లులను ఆమోదించారు. 25-24 ఓట్లతో ఆమోదం పొందింది. దీంతో వెస్ట్‌బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్‌కు మార్గం సుగమం అయింది.
