Site icon NTV Telugu

Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిలో ప్రాంతంలో సముద్రంలో మందుపాతరలు(సీమైన్స్) అమర్చుతున్న పడవను గుర్తిస్తే, అమెరికా నేవీ వెంటనే ముంచివేయాలని ఆయన ఆదేశించారు. మైన్ క్లియరెన్స్ ఆపరేషన్లను మూడు రెట్లు పెంచాలని ఆదేవించారు. హార్ముజ్‌లో ఏదైనా పడవ సీమైన్స్ పెడుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే కాల్చిపారేయాలని ట్రంప్ సూటిగా చెప్పారు.

Read Also: AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి ఉద్రిక్త ప్రాంతంగా మారింది. ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే ఈ ఇరుకైన సముద్ర మార్గం ప్రపంచ గ్యాస్, చమురు రవాణాలో 20 శాతం సరఫరాను కలిగి ఉంది. ఈ మార్గంలోని ఉద్రిక్తతలు ప్రపంచ చమురు రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 35 కి.మీ వెడల్పు ఉండే ఈ ప్రాంతంపై ఇరాన్, అమెరికాలు తమ దిగ్బంధాన్ని కొనసాగిస్తున్నాయి.

హార్ముజ్ పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉందని, నౌకల రాకపోకలు యూఎస్ నేవీ అనుమతితోనే జరుగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం ఈ జలసంధిని తమ డిమాండ్లు తీరే వరకు తెరిచేది లేదని స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం, ఇరాన్ సముద్రంలో అమర్చిన సీమైన్స్ తీయడం కష్టంగా మారినట్లు చెబుతున్నాయి. వీటిని తీసేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుందని చెప్పాయి.

Exit mobile version