Site icon NTV Telugu

US: నేడు పాక్ ఆర్మీ చీఫ్‌ మునీర్‌తో ట్రంప్ భేటీ.. కలిసి లంచ్ చేయనున్న నేతలు

Trump

Trump

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో అమెరికాలో పర్యటిస్తున్నారు. అసిమ్ మునీర్ రెచ్చగొట్టడంతోనే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల తర్వాత అసిమ్ మునీర్‌ అమెరికాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: G7 Summit: జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ

పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 1 ఒంటి గంటకు వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అసిమ్ మునీర్‌తో ట్రంప్ సమావేశం కానున్నారు. ఇద్దరు కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం ఇద్దరి మధ్య సమావేశం జరగనుంది. ఇక అమెరికా పర్యటనలో భాగంగా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌లను కూడా అసిమ్ మునీర్ కలవనున్నారు.

ఇది కూడా చదవండి: ENG vs IND: బుమ్రా ఆడొద్దని ఇంగ్లండ్‌ టీమ్‌ కోరుకుంటోంది.. బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌కు సిందు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కెనడాలో జీ 7 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చారు. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో అర్ధాంతరంగా అమెరికాకు వెళ్లిపోయారు. వాస్తవానికి ఈ సమావేశంలో ట్రంప్‌తో మోడీ భేటీ అయి సుంకాలపై చర్చించాలి. కానీ ట్రంప్ వెళ్లిపోవడంతో కీలక చర్చలు జరగకుండానే ఆగిపోయాయి.

Exit mobile version