Site icon NTV Telugu

Trump: రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే భారత్‌కు 500 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ హెచ్చరికలు

Modi

Modi

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మిత్ర దేశాలను కూడా శత్రు దేశాలుగా మార్చుకుంటున్నారు. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేకపోయింది. నిత్యం అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. ఈ విషయం ట్రంప్‌కు రుచించడం లేదు. దీంతో రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యాను కంట్రోల్‌లోకి తేవాలంటే దాని మిత్ర దేశాలపై 500 శాతం సుంకాలు విధించాలని కేబినెట్ సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Nimisha Priya Case: మరో రెండు రోజుల్లో ఉరిశిక్ష.. సుప్రీంకోర్టుకు చేరిన నిమిషా ప్రియా కేసు..

రష్యాను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు దాని మిత్ర దేశాలపై దెబ్బ కొట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ఇంధనాన్ని కొలుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించాలని ప్రణాళిక రచిస్తు్న్నారు. రష్యా మిత్ర దేశాలపై 500 శాతం సుంకాలను ప్రతిపాదించే అమెరికా సెనేట్ బిల్లుకు ట్రంప్ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సెనేటర్ లిండ్సే గ్రాహం బిల్లును తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌‌పై రష్యా దాడులు ఆపేందుకే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అని సమాచారం.

ఇది కూడా చదవండి: PVN Madhav: చాగంటితో భేటీ.. కాకినాడ ప్రవచన రాజధానిగా మారిందన్న మాధవ్‌..

రష్యా ఇంధనాన్ని భారత్, చైనా కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యలో భారత్, చైనాలపై భారీగా 500 శాతం సుంకాలను విధించాలని ట్రంప్ సూచించినట్లు సమాచారం. అదే జరిగితే భారత్‌పై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

రష్యాపై నిషేధం విధించే బిల్లును ట్రంప్ సన్నిహిత మిత్రుడు సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే 84 మంది సహ-స్పాన్సర్ల మద్దతు ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా క్రూరమైన దాడి ఆపాలంటూ మిత్ర దేశాలైన చైనా, భారతదేశంపై సుంకాల పేరుతో ఒత్తిడి తీసుకురావడమే మార్గమని గ్రాహం అన్నారు. బిల్లు ఆమోదం పొందుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

ఇటీవల వాషింగ్టన్‌ను సందర్శించిన సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును భారతదేశం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. ఇంధన భద్రతపై భారతదేశం ఆందోళనలను తెలియజేయడానికి భారత రాయబార కార్యాలయం, రాయబారి సెనేటర్ గ్రాహంతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.

Exit mobile version