Site icon NTV Telugu

Trump-Greenland: గ్రీన్‌లాండ్ కావాలంటే ఇలా చేయండి.. వైరల్‌గా మారిన ట్రంప్‌కు కొత్త ప్రతిపాదన

Trumpsonwedding

Trumpsonwedding

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా ఉన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారో లేదో వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై కన్నుపడింది. ఎలాగైనా గ్రీన్‌‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రతిపాదన వైరల్‌గా మారింది. గ్రీన్‌లాండ్ కావాలంటే ఎలాంటి యుద్ధం చేయకుండా సొంతం చేసుకునే ప్రతిపాదన వైరల్ అవుతోంది. ట్రంప్ కుమారుడైన బారన్ ట్రంప్‌కు డెన్మార్క్ యువరాణి ఇస్లాబెల్లాతో వివాహం జరిపిస్తే.. కట్నంగా గ్రీన్‌లాండ్‌ను సొంతంగా చేసుకోవచ్చని నెటిజన్లు సలహాలు ఇస్తు్న్నారు. ఇందుకు సంబంధించిన వివాహ ప్రతిపాదన వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఈ ప్రతిపాదన లక్షలాది మందిని ఆకర్షించింది. అంతేకాకుండా జోకులు, మీమ్స్, తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. కొంత మంది ఈ ప్రతిపాదనను సమర్థించగా.. ఇంకొందరు అసంబద్ధం అంటూ కొట్టిపారేశారు. మరికొందరు అభ్యంతరకంగా ఉందంటూ విమర్శించారు.

గ్రీన్‌లాండ్‌ చరిత్ర..
18వ శతాబ్దం నుంచి గ్రీన్‌లాండ్‌ డెన్మార్క్‌లో భాగంగా ఉంది. ప్రస్తుతం ఇది డానిష్ నియంత్రణలో ఉంది. ఈ ద్వీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం లేదా? స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని హెచ్చరించింది. అయినప్పటికీ 2019లోనే గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనను ట్రంప్ మొదట ప్రతిపాదించారు. ప్రస్తుతం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ ప్రతిపాదనను ట్రంప్ రెట్టింపు చేశారు. కచ్చితంగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు యూరోపియన్ మిత్రదేశాలు, నాటో భాగస్వాములను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి.

ఇసాబెల్లా..
ఇసాబెల్లా.. డెన్మార్క్ యువరాణి. 2025లో 18 ఏళ్లు నిండాయి. 2007, ఏప్రిల్ 21న జన్మించింది. డానిష్ సింహానం వరుసలో రెండో స్థానంలో ఉంది. రాజు ఫ్రెడరిక్-క్వీన్ మేరీ పెద్ద కుమార్తె. ప్రస్తుతం న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తోంది. ఇటీవల ఫొటోషూట్‌తో వార్తల్లో నిలిచారు.

 

Exit mobile version