Site icon NTV Telugu

DONALD TRUMP: ట్రంప్‌కు హఠాత్తుగా చైనాపై కోపం.. 100 శాతం టారిఫ్ ఎందుకు.?

Trade War

Trade War

DONALD TRUMP: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా చైనాపై 100 శాతం సుంకాలను విధించారు. అయితే, ఉన్నట్లుండి ట్రంప్‌కు చైనాపై ఎందుకంత కోసం వచ్చిందనేది ఆసక్తిగా మారింది. నవంబర్ 01 నుంచి చైనా నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్నయం తీసుకున్నారు. రేర్-ఎర్త్ ఖనిజాలపై చైనా కొత్త నియంత్రణలను తీసుకువచ్చిన తర్వాత, అమెరికా నుంచి ఈ చర్య వచ్చింది.

రేర్ ఎర్త్ ఖనిజాలు సెమీ కండక్టర్లు, ఫైటర్ జెట్‌లు, ఇతర అధునాతన టెక్నాలజీలో ఉపయోగిస్తారు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యం ఉంది. అయితే, సుంకాలపై ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో, చైనా ‘‘అసాధారణంగా దూకుడు’’ వైఖనిని తీసుకుందని ఆయన ఆరోపించారు. చైనా చర్యలను ‘‘అంతర్జాతీయ వాణిజ్యంలో నైతిక అవమానం’’గా పిలిచారు. బీజింగ్ అదనపు చర్యలు తీసుకుంటే అదనపు సుంకాలు త్వరలో అమలులోకి వస్తాయని ట్రంప్ హెచ్చరించారు.

Read Also: West Bengal: బెంగాల్‌లో మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. క్యాంపస్ సమీపంలోనే దారుణం..

దక్షిణ కొరియాలో జరిగే APEC శిఖరాగ్ర సమావేశానికి ముందు చైనా ఉద్దేశపూర్వకంగా ఎగుమతి నియంత్రణలను విధిస్తోందని అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ సమావేశ వేదికలో ట్రంప్, జిన్‌పింగ్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సమావేశం సందిగ్ధంలో పడింది. తాను జిన్‌పింగ్‌ను కలవడానికి ఎలాంటి కారణం లేదని ట్రంప్ అన్నారు.

చైనా రేర్ ఎర్త్ ఖనిజాలపై పరిమితులు విధించడం, నేరుగా అమెరికా పారిశ్రామిక, రక్షణ అవసరాలను దెబ్బతీస్తుంది. అమెరికా తన రేర్ ఎర్త్ అవసరాలపై ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉంది. ఇప్పుడిప్పుడే, యూఎస్ తన దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో ఉంది. అమెరికాలో ఏకైక రేర్ ఎర్త్ ఉత్పత్తిదారుగా ఉన్న ఎంపీ మెటీరియల్స్‌లో 400 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది.

Exit mobile version