Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
- ఫోటోలో కోపంగా కనిపించినా
- మేము స్నేహితులమే
- కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Kim Jong Un photo: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని ప్రస్తావించారు. కిమ్‌తో కలిసి ఉన్న ఓ పాత ఫోటోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో షేర్ చేసిన ట్రంప్.. ఫోటోలో ఇద్దరూ సీరియస్‌గా కనిపిస్తున్నప్పటికీ, తమ మధ్య సంబంధాలు బాగున్నాయని తెలిపారు. ట్రంప్ షేర్ చేసిన ఫోటోలో ఆయన, కిమ్ జోంగ్ ఉన్ ఇద్దరూ గంభీరంగా కనిపించారు. అయితే ఈ ఒక్క ఫోటోను చూసి తమ సంబంధాన్ని అంచనా వేయొద్దన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు. కిమ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు.
సైనిక విన్యాసాలకు ముందు ట్రంప్ వ్యాఖ్యలు
ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహించే వార్షిక ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ (UFS) సైనిక విన్యాసాలు ఆగస్టు 17 నుంచి 27 వరకు జరగనున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా ఈ విన్యాసాలను రక్షణ సన్నద్ధతను పెంచుకునేందుకు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నాయి. అయితే ఉత్తర కొరియా మాత్రం వీటిని తమపై దాడికి సన్నాహక చర్యలుగా పరిగణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ఏడాది విన్యాసాల్లో డ్రోన్లు, సైబర్ దాడులు, GPS జామింగ్ వంటి ఆధునిక యుద్ధ పరిస్థితులకు సంబంధించిన అంశాలపై కూడా శిక్షణ ఉండనుంది.
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
అమెరికా-దక్షిణ కొరియా-జపాన్‌పై ఉత్తర కొరియా ఆగ్రహం
అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారంపై ఉత్తర కొరియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మూడు దేశాల సహకారం క్రమంగా ‘అణు కూటమి’గా మారుతోందని ఉత్తర కొరియా ఆరోపించింది. తమ భద్రతకు ముప్పు పెరిగితే మరింత బలమైన, దూకుడు ప్రతిస్పందన ఇస్తామని ప్యాంగ్యాంగ్ హెచ్చరించింది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను కూడా ఉత్తర కొరియా గతంలో కంటే మరింత ప్రమాదకరంగా అభివర్ణించింది.
మరోసారి క్షిపణి పరీక్ష
ఈ ఉద్రిక్తతల మధ్య ఉత్తర కొరియా ఆగస్టు 12న తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ అధికారుల ప్రకారం క్షిపణి సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడింది. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు కొద్ది రోజుల ముందు ఈ ప్రయోగం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఆగస్టులో ఉత్తర కొరియా నిర్వహించిన రెండో క్షిపణి ప్రయోగంగా వెల్లడైంది.
ట్రంప్-కిమ్ సంబంధం మరోసారి చర్చలోకి
అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణు, క్షిపణి అంశాలపై విభేదాలు కొనసాగుతున్నప్పటికీ.. ట్రంప్ మాత్రం కిమ్ జోంగ్ ఉన్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని పలుమార్లు ప్రస్తావించారు. తాజాగా పాత ఫోటోను షేర్ చేయడం ద్వారా కూడా కిమ్‌తో తన సంబంధాలు సానుకూలంగానే ఉన్నాయని ట్రంప్ సంకేతం ఇచ్చారు. అయితే అదే సమయంలో అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు కొనసాగుతుండటం కొరియా ద్వీపకల్పంలోని వ్యూహాత్మక పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తోంది. దీంతో ట్రంప్-కిమ్ మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ.. రెండు దేశాల మధ్య భద్రత, అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదనే విషయం స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?