Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..

  • అల్లా దయతో హార్ముజ్ స్వాధీనం చేసుకున్నాం..
  • ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్..
Trump

Trump

Donald Trump:  అమెరికా-ఇరాన్ యుద్ధానికి కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’పై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అల్లా దయతో హార్ముజ్‌పై అమెరికా ‘‘పూర్తి నియంత్రణ’’ సాధించిందని ప్రకటించారు. అమెరికా నేవీ దిగ్భందాన్ని పలువురు ‘‘ఉక్కు గోడ’’గా పిలుస్తున్నారని, దాన్ని కొనసాగిస్తామని ట్రంప్ అన్నారు. ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.

ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో బలమైన దేశంగా ఉన్న ఇరాన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 300 శాతానికి చేరుకుందని ఆయన ఆరోపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌కు నేవీ, వైమానిక దళం లేదని, సైన్యంలో మిగిలిన సిబ్బందికి జీతాలు కూడా అందడం లేదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దెబ్బతిన్నదని, ఆ దేశ నాయకత్వ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఇరాన్ కేవలం మాటలే చెబుతోందని, చేతలు లేవని చెప్పారు. తన పోస్టును ‘‘అల్లాకు ధన్యవాదాలు’’ అంటూ ముగించారు.