Trump: ఆ విషయంలో ఇజ్రాయెల్ కంటే సిరియానే బెటర్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

  • ఇజ్రాయెల్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
  • హిజ్బుల్లా లక్ష్యం గాడి తప్పిందని వ్యాఖ్య
  • ఈ విషయంలో సిరియానే బెటర్ అంటూ విమర్శలు
Trump

Trump

ఇజ్రాయెల్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్‌కు బదులు సిరియానే బెటర్ అని వ్యాఖ్యానించారు. జీ 7 సదస్సులో భాగంగా ట్రంప్ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఖతార్ ఎమిర్‌తో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఇజ్రాయెల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిజ్బుల్లాపై పోరాటంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హిజ్బుల్లా పేరుతో మనుషులందరినీ చంపడం సరైంది కాదన్నారు. టార్గెట్ వ్యక్తులు కాకుండా.. మనుషులందరినీ చంపేస్తున్నారు. ఇదేమీ బాగోలేదన్నారు. అవసరమైతే సిరియానే ఈ పని మెరుగ్గా చేయగలదని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలను దాదాపు దెబ్బతీశాయని కూడా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు చాలా కాలంగా కొనసాగుతున్నాయని.. అమాయకుల ప్రాణనష్టం అధికంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

×
×
Ad

నెతన్యాహూపై అసహనం


ఇదిలా ఉండగా అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల ప్రాథమిక శాంతి ఒప్పందానికి అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంలో లెబనాన్‌లో సైనిక చర్యలకు ముగింపు పలకడం కూడా భాగమని ఇరాన్, పాకిస్థాన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పరిణామం ఇజ్రాయెల్‌కు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి తెరవడం, ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల సడలింపు వంటి అంశాలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నట్లు సమాచారం. అయితే నెతన్యాహుతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. కానీ లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.