Trump: ఆ విషయంలో ఇజ్రాయెల్ కంటే సిరియానే బెటర్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ఇజ్రాయెల్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- హిజ్బుల్లా లక్ష్యం గాడి తప్పిందని వ్యాఖ్య
- ఈ విషయంలో సిరియానే బెటర్ అంటూ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్‌కు బదులు సిరియానే బెటర్ అని వ్యాఖ్యానించారు. జీ 7 సదస్సులో భాగంగా ట్రంప్ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఖతార్ ఎమిర్‌తో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఇజ్రాయెల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిజ్బుల్లాపై పోరాటంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హిజ్బుల్లా పేరుతో మనుషులందరినీ చంపడం సరైంది కాదన్నారు. టార్గెట్ వ్యక్తులు కాకుండా.. మనుషులందరినీ చంపేస్తున్నారు. ఇదేమీ బాగోలేదన్నారు. అవసరమైతే సిరియానే ఈ పని మెరుగ్గా చేయగలదని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలను దాదాపు దెబ్బతీశాయని కూడా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు చాలా కాలంగా కొనసాగుతున్నాయని.. అమాయకుల ప్రాణనష్టం అధికంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
నెతన్యాహూపై అసహనం
ఇదిలా ఉండగా అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల ప్రాథమిక శాంతి ఒప్పందానికి అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంలో లెబనాన్‌లో సైనిక చర్యలకు ముగింపు పలకడం కూడా భాగమని ఇరాన్, పాకిస్థాన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పరిణామం ఇజ్రాయెల్‌కు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి తెరవడం, ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల సడలింపు వంటి అంశాలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నట్లు సమాచారం. అయితే నెతన్యాహుతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. కానీ లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అమెరికా లేకుండా ఇజ్రాయెల్ మనుగడ సాధించడం అసాధ్యం అని తేల్చి చెప్పారు.
#WATCH | Evian, France: US President Donald Trump says, "The only thing that really matters to me is Iran will never have a nuclear weapon. And it says it loud and clear. They're not going to develop it. They're not going to buy it. They're not going to do anything with it. And… pic.twitter.com/VvwFPZjbLE
— ANI (@ANI) June 16, 2026
#WATCH | Evian, France: US President Donald Trump says, "We have our deal done with Iran, and it should be successful. It goes to a second stage, which I think will be actually easier. I didn't want to attack them last week, but we had no choice. And we did it twice, actually. We… pic.twitter.com/PaauVZ0bP8
— ANI (@ANI) June 16, 2026
- Tags
- Donald Trump
- Hezbollah
- Israel
- trump
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?