Site icon NTV Telugu

Trump: మోడీ ఎప్పుడూ మంచి స్నేహితుడే.. గంటకో మాట మాట్లాడుతున్న ట్రంప్

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ గురించి గానీ.. మోడీ గురించి గానీ గంటకో మాట మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడే విమర్శిస్తుంటారు.. అంతలోనే మాట మారుస్తూ ఉంటారు. భారత్.. అమెరికాకు దూరం అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతలోనే మీడియా సమావేశంలో అదేమీ లేదు.. మోడీతో ఎప్పుడూ మంచి స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Imran Khan: జైలు దగ్గర ఇమ్రాన్‌ఖాన్ సోదరిపై కోడిగుడ్డు దాడి.. వీడియో వైరల్

భారత్, రష్యా చైనాకు దురమయ్యాయని.. ఆ రెండు దేశాలు చీకటి చైనా చేతిలోకి వెళ్లిపోయాయని.. ఇటీవల చైనాలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోనే తన సొంత సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై విలేకర్లు ప్రశ్నించగా మోడీతో మంచి స్నేహం ఉందని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనదిగా అభివర్ణించారు. అయితే రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడంతోనే సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. ఈ మధ్య భారత్ ప్రవర్తిస్తున్న తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. అయినా కూడా అప్పుడప్పుడు విభేదాలు ఉన్నప్పటికీ ఆందోళన చెందడానికి ఏమీలేదని పేర్కొన్నారు. మోడీ మంచి ప్రధాని అని.. ఆయనతో స్నేహం ఉందని శుక్రవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Priya Prakash : పదునైన అందాలతో ప్రియా వారియర్ రచ్చ

ఇక 2026 జీ20 శిఖరాగ్ర సదస్సును మియామిలోని తన సొంత గోల్ఫ్‌ రిసార్ట్‌లో నిర్వహించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సమ్మిట్‌ జరగనుంది. అంతేకాకుండా అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ వార్‌’గా మార్చే ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు.

భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఇలా భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. ఈ సుంకాలు కారణంగానే రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి.

 

Exit mobile version