Site icon NTV Telugu

Trump: ‘‘దాచడానికి ఏముంది?’’ ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్

Trump2

Trump2

అంతర్జాతీయ సెక్స్ స్కామ్‌కు సంబంధించిన ఎప్‌స్టీన్ ఫైల్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికా రక్షణ శాఖ పత్రాలను విడుదల చేస్తోంది. ఈ పత్రాల్లో ఇప్పటికే అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. బిల్ క్లింటన్, బిల్ గేట్స్, డెమొక్రాటిక్ నేతల సహా ఎందరో ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ప్రపంచ అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

తాజాగా ఇదే అంశం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. ‘‘నా దగ్గర దాచడానికి ఏమీ లేదు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. తనకు క్లీన్ చిట్ లభించిందని స్పష్టం చేశారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రజలు పరిశీలించాక పూర్తిగా తాను నిర్దోషిగా బయటపడినట్లు చెప్పారు. ఎప్‌స్టీన్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని.. ఆ ఫైల్స్‌లో తన పేరు లేకపోవడంతో తనకు క్లీన్‌చిట్ లభించిందని పేర్కొన్నారు. ‘‘ఎప్‌స్టీన్ ఒక డెమొక్రాట్.. అది డెమొక్రాట్ సమస్య. రిపబ్లికన్ సమస్య కాదు.’’ అని గత సంవత్సరం ట్రంప్ అన్నారు. అయినా ట్రంప్‌తో సమయాన్ని వృధా చేసుకోవద్దని.. తనకు పరిగెత్తడానికి ఒక దేశం ఉందని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Haryana: 5 నెలల క్రితమే బ్యాంక్ ఉద్యోగినితో పెళ్లి.. వాలెంటైన్ డే రోజున భర్త ఏం చేశాడంటే..!

1990-2000 మధ్య ఎప్‌స్టీన్-ట్రంప్ మధ్య పరిచయం ఉంది. న్యాయ శాఖ విడుదల చేసిన ఫైల్స్‌లో కనిపించింది. అయితే రికార్డుల్లో ఎక్కడా కూడా తప్పు జరిగినట్లుగా ఆరోపణలు రాలేదు. నవంబర్ 2025లో ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల చేయాలని న్యాయశాఖకు ట్రంపే ఆదేశించారు. అలాగే 2019లో ఫెడరల్ జైల్లో మరణించిన ఎప్‌స్టీన్ సమాచారాన్ని కూడా విడుదల చేయాలని సూచించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి ఇప్పటి వరకు లక్షలాది పేజీలు బయటకు వచ్చాయి. పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. ఫైల్స్ బయటకు వచ్చాక అనేక మంది పదవులు పోయాయి. మరికొన్ని ఫైల్స్ విడుదల కావాల్సి ఉంది.

Exit mobile version