NTV Telugu Site icon

Trump: సునీతా విలియమ్స్‌కు ట్రంప్ గిఫ్ట్.. ఓవర్‌టైమ్‌ జీతం సొంతంగా చెల్లిస్తానని వెల్లడి

Trump

Trump

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహుమానం ప్రకటించారు. ఓవర్‌టైమ్ జీతాన్ని తానే చెల్లిస్తానని ట్రంప్ ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో ట్రంప్‌ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను చేయాల్సి వస్తే.. తన జేబు నుంచి వారికి ఓవర్‌టైమ్‌ జీతం చెల్లిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చేందుకు సాయం చేసిన ఎలాన్‌ మస్క్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన లేకపోతే ఏమై ఉండేదో ఓసారి ఆలోచించాలని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: JACK : ఆ యంగ్ హీరో వైష్ణవి చైతన్యని గట్టెక్కిస్తాడో లేదో..?

సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్ష యాత్రకు వెళ్లారు. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక లోపంతో అక్కడే ఉండి పోవల్సి వచ్చింది. మొత్తానికి నాసా చేసిన ప్రయత్నాలు ఫలించడంతో క్షేమంగా భూమ్మీదకు వచ్చారు. అయితే అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువకాలం పనిచేసిన వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని నాసా తెలిసింది. ఫెడరల్‌ ఉద్యోగులు అయినందువల్ల.. భూమ్మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని నాసా నిపుణులు వెల్లడించారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు ఐఎస్‌ఎస్‌లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అదనంగా చెల్లించాల్సి వస్తే.. తానే ఆ ఖర్చులు భరిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Nikhil : ఆ రెండు పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటంటే..?