Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- ట్రంప్ ప్రచార సభలో గందరగోళం
- ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయాలంటూ నిరసన
- నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- ‘లావుగా ఉన్నావు’ అంటూ ట్రంప్ ఎగతాళి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఓ రాజకీయ సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలంటూ టీషర్ట్ ధరించి నిరసన తెలిపిన ఓ వ్యక్తిపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. అతడిని కొట్టడంతో పాటు బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ట్రంప్ ఖండన వ్యక్తం చేయకపోగా.. నిరసనకారుడిని ‘లావుగా ఉన్న వ్యక్తి’ అంటూ ఎగతాళి చేశారు.
‘ది సండే గార్డియన్’ అక్టోబర్ 13న ప్రచురించిన కథనం ప్రకారం.. ట్రంప్ సభకు వచ్చిన ఓ వ్యక్తి ‘Release the Epstein Files’ (ఎప్స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేయాలి) అని రాసి ఉన్న టీషర్ట్ ధరించాడు. ఈ క్రమంలో అక్కడున్న కొందరితో అతడికి వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు అతడిపై దాడి చేసి, పిడిగుద్దులు గుద్దారు. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని సభ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు తెలిపింది. అయితే దాడిలో అతడికి ఎంతవరకు గాయాలయ్యాయి? ఈ ఘటనకు సంబంధించి ఎవరినైనా అరెస్టు చేశారా? అనే వివరాలు స్పష్టంగా తెలియరాలేదు.
Also Read
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
నిరసనకారుడిని బయటకు తీసుకెళ్తున్న సమయంలో ట్రంప్ వేదికపై నుంచి అతడిపై వ్యాఖ్యలు చేసినట్లు నివేదిక పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థులు పంపిన వ్యక్తిగా అభివర్ణిస్తూ.. ‘‘వామపక్షవాదులు డబ్బులు ఇచ్చి వీళ్లను పంపిస్తున్నారు. మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీళ్లు నీచులు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా నిరసనకారుడి శరీరాకృతిపై కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ‘‘అతను ఇంటికి వెళ్లి తన తల్లితో ఉండాలి. బరువు తగ్గాలి.. అతను లావుగా ఉన్నాడు’’ అంటూ ఎగతాళి చేశారు.
- Tags
- Donald Trump
- trump
- Trump rally
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!