సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ బుధవారంతో ముగుస్తోంది. కానీ ఇంతలోనే వాణిజ్య భాగస్వామ దేశాలైన జపాన్, దక్షిణ కొరియాపై భారీగా సుంకాలు విధించారు. ఆ రెండు దేశాలకు రాసిన లేఖల్లో జపాన్, దక్షిణ కొరియా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Father Abuse on Daughters: తండ్రి కాదు కామ పిశాచి.. ఐదుగురు కూతుర్లపై అత్యాచారం.. వీడియో వైరల్..!
ఏప్రిల్ 2న ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో 90 రోజుల పాటు వాయిదా వేశారు. ఆ గడువు జూలై 9తో ముగుస్తోంది. దీంతో ట్రంప్.. ఆయా వాణిజ్య దేశాలకు లేఖలు రాశారు. గడువులోగా ఒప్పందాలు చేసుకోవాలని కోరారు. ఇలా మొదటి బ్యాచ్‌గా 15 దేశాలకు లేఖలు పంపించారు. ఇక ఆగస్టు 1 నుంచి జపాన్, దక్షిణ కొరియాకు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. తూర్పు ఆసియాలో ఈ రెండు దేశాలు.. అమెరికాకు మిత్ర దేశాలు.. మొట్టమొదటిగా మిత్ర దేశాలకే ట్రంప్ షాకిచ్చారు. ఈ రెండు దేశాలకు 25 శాతం సుంకాలు విధించారు.
ఇక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా మాట్లాడుతూ.. వాషింగ్టన్‌తో వాణిజ్య చర్చల్లో తాము సులభంగా రాజీపడబోమని తెలిపారు. సుంకాల పేరుతో అమెరికా దోచుకుంటోందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: 8 Vasanthalu OTT: ‘8 వసంతాలు’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..!
ప్రస్తుతం యూకే, వియత్నాం మాత్రం ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక చైనా మాత్రం పరస్పరం తాత్కాలికంగా సుంకాలను తగ్గించుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక ఏ దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. అయితే ప్రస్తుతం చర్చలు నడుస్తున్న నేపథ్యంలో డెడ్‌లైన్‌ను ఆగస్టు 1 వరకు ట్రంప్ పొడిగించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సోమవారం ట్రంప్ సంతకం చేశారు. భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలో కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బ్రిక్స్ దేశాలతో సంబంధాలు పెట్టుకునే వారిపై మరో 10 శాతం అదనంగా సుంకాలు వసూలు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
