US Tariffs on India: భారత్‌కు ట్రంప్ మరో షాక్.. భారతీయ వస్తువులపై అమెరికా భారీ టారిఫ్‌లకు సిద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Tariffs on India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి వాణిజ్య సుంకాల పెంపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా సహా పలు వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక టారిఫ్‌లు విధించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ వారంలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపింది.
అమెరికా పరిశ్రమలకు నష్టం కలిగించే విధంగా కొన్ని దేశాలు అధిక పారిశ్రామిక ఉత్పత్తికి ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ చర్యల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ ధరలకు వస్తువులు విక్రయిస్తూ అమెరికా తయారీ రంగానికి ఆయా దేశాలు పోటీగా మారుతున్నాయని పేర్కొంటోంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ మార్చి 11న ప్రారంభించిన దర్యాప్తు ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం. 1974 నాటి అమెరికా ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద భారత్ సహా మొత్తం 16 ఆర్థిక వ్యవస్థలపై ఈ విచారణ చేపట్టారు.
Also Read
- Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
- Bangladesh Measles Outbreak: బంగ్లాదేశ్‌లో మీజిల్స్ కలకలం.. 1,361 మంది మృతి.. భారత్‌కు కూడా ముప్పు ఉందా?
- Saudi Arabia Houthi Attack: సౌదీ అరేబియాలో హౌతీ రెబల్స్ దాడి.. 11 మందికి గాయాలు.. ఇద్దరు భారతీయులకు తీవ్ర గాయాలు!
- CIA Cyber Attack: CIAపై భారీ సైబర్ దాడి.. అమెరికా నిఘా వ్యవస్థలో కలకలం!
ఈ చట్టం ప్రకారం ఇతర దేశాలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు పాల్పడుతున్నాయని నిర్ధారణకు వస్తే, అమెరికా అధ్యక్షుడికి వాటిపై దిగుమతి సుంకాలు విధించే అధికారం ఉంటుంది. భారత్, వియత్నాం దేశాలపై యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా కంటే ఎక్కువ సుంకాలు విధించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా దేశాలపై 15 శాతం లేదా అంతకంటే తక్కువ టారిఫ్‌లు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే భారత్‌పై ఎంత శాతం సుంకం విధించనున్నారనే విషయాన్ని నివేదిక స్పష్టం చేయలేదు. చైనాపై మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే మరింత అధిక సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. గత ఫిబ్రవరిలో ఖరారైన ఒప్పంద ప్రాథమిక రూపురేఖలు మళ్లీ చర్చల దశకు వెళ్లాయి. గతంలో విధించిన కొన్ని టారిఫ్‌లకు సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువులకు బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా వంటి పోటీ దేశాల కంటే తక్కువ దిగుమతి సుంకాలు ఉండాలని భారత్ కోరుతోంది. గతంలో భారత్‌కు పోటీ దేశాల కంటే గణనీయమైన టారిఫ్ ప్రయోజనం కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తుది ఒప్పందంలో సుంకాల నిర్మాణం ఎలా ఉంటుందనే దానిపైనే ఈ ప్రయోజనం ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY) ముగిసేలోపు వాణిజ్య ఒప్పందంలోని తొలి దశను పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి వార్తా సంస్థ ANIకి తెలిపారు. అదే సమయంలో పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) కోసం కూడా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తొలి దశ ఒప్పందంలో సేవల రంగానికి సంబంధించిన అంశాలు ఉండవని, వాటిని రెండో దశలో చర్చించి, అనంతరం పూర్తిస్థాయి ఒప్పందంలో చేర్చనున్నట్లు ఆ అధికారి వివరించారు. తుది ఒప్పందం చట్టపరమైన పత్రం రూపంలో, అనుబంధాలతో పాటు కస్టమ్స్, వాణిజ్య సౌలభ్యానికి ప్రత్యేక అధ్యాయంతో రూపొందే అవకాశం ఉందని తెలిపారు.
2025 నుంచి భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. దేశీయ పరిశ్రమలు, రైతులు, వ్యాపార రంగ ప్రయోజనాలకు నష్టం కలగకుండా ఒప్పందాన్ని ఖరారు చేయాలని భారత్ భావిస్తోంది. ఒకవేళ అమెరికా భారత్‌పై అధిక దిగుమతి సుంకాలు విధిస్తే, భారతీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడే వస్తు ఎగుమతిదారులకు ధరల పోటీ మరింత పెరగవచ్చు.
తాజావార్తలు
-
US Tariffs on India: భారత్‌కు ట్రంప్ మరో షాక్.. భారతీయ వస్తువులపై అమెరికా భారీ టారిఫ్‌లకు సిద్ధం!
-
Anupama Parameswaran-Bhogi: ‘భోగి’ ప్రమోషన్స్‌కు అనుపమ దూరం.. కారణం అదేనా?
-
Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
-
Delhi Gang Rape Case: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరెస్టు
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!