Site icon NTV Telugu

Trump: యుద్ధాలను ఆపడం ఇష్టం.. వచ్చే ఏడాది నోబెల్ రావొచ్చేమో!

Trump

Trump

యుద్ధాలను ఆపడం తనకు చాలా ఇష్టమని ట్రంప్ అన్నారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడారు. ఏ అధ్యక్షుడు కూడా ఒక్క యుద్ధాన్ని ఆపలేదని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను మాత్రం ఎనిమిది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా తనకు నోబెల్ బహుమతి వచ్చిందా? అంటే లేదన్నారు. కానీ వచ్చే ఏడాది బాగుంటుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. తాను దేని గురించి శ్రద్ధ వహిస్తున్నానో మీకు తెలుసా? తాను వందల మిలియన్ల ప్రాణాలను కాపాడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav Vs BJP: తేజస్వి యాదవ్‌పై సతీష్ కుమార్ పోటీ.. బ్యాగ్రౌండ్ ఇదే!

యుద్ధాలను వాణిజ్యాన్ని ఉపయోగించి ఆపినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఉదాహరణకు భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఏడు విమానాలు కూలిపోయాయని.. అప్పుడు ఇరుదేశాలతో మాట్లాడినట్లు వివరించారు. ఇద్దరితోనూ వాణిజ్యం గురించి మాట్లాడడం జరిగిందని.. యుద్ధాన్ని ఆపకపోతే వాణిజ్య ఒప్పందం చేసుకోబోమని హెచ్చరించినట్లు గుర్తుచేశారు. యుద్ధం ఆపకపోతే అమెరికాకు విక్రయించే ఏ ఉత్పత్తికైనా 200 శాతం సుంకం విధిస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇరు దేశాల నాయకుల నుంచి మరుసటి రోజే ఫోన్ వచ్చిందని.. యుద్ధాన్ని కొనసాగించాలని అనుకోవడం లేదని చెప్పారని తెలిపారు. అందుకే ఆ ఇద్దరు నాయకులంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మరోసారి మోడీపై ప్రశంసలు కురింపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని ట్రంప్ పొగిడారు.

ఇది కూడా చదవండి: Modi Trump Meeting: రష్యా నుండి చమురు కొనుగోలు ఆపబోతున్న భారత్.. ట్రంప్ ఏమన్నారంటే?

మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. అనంతరం ఇరుదేశాల చర్చలతో యుద్ధం ఆగింది. ట్రంప్ ప్రకటనను పాకిస్థాన్ స్వాగతించగా.. భారతదేశం మాత్రం ఖండించింది. కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. అయినా కూడా ట్రంప్ పదే పదే భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని చెబుతున్నారు.

Exit mobile version