Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..
- ఇక మీకు అమెరికా సాయం చేయదు..
- దమ్ముంటే హార్ముజ్ నుంచి ఆయిల్ తెచ్చుకోండి..
- యూకే, ఫ్రాన్స్‌లపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి యూకే, నాటో మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్రిటన్, ఫ్రాన్స్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా యుద్ధ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇజ్రాయిల్ వైపు వెళ్తున్న తమ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి నిరాకరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా, మిత్ర దేశం యూకే వైఖరిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.
Read Also: Tamil Nadu Elections: స్టాలిన్, ఈపీఎస్, విజయ్: తమిళనాడు సీఎం అభ్యర్థులు పోటీ చేసేది ఇక్కడి నుంచే..
Also Read
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ఇరాన్ దాడుల్లో అమెరికాకు సాయం చేయదని దేశాలను ఉద్దేశిస్తూ.. వెళ్లి మీరు చమురు తెచ్చుకోండి అంటూ హెచ్చరించారు. ‘‘ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని నిర్మూలించే చర్యలో పాల్గొనడానికి నిరాకరించిన దేశాలు తమకు కావాల్సిన చమురును అమెరికా నుంచి కొనుగోలు చేయాలని లేదా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లి చమురు తెచ్చుకోవాలని రెండు ఆఫ్షన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో రాశారు. మిత్రదేశాలపై ట్రంప్ తన అసనాన్ని వ్యక్తం చేస్తూ.. ఇకపై ఆ దేశాలు తమ కోసం తాము ఎలా పోరాడాలో నేర్చుకోవాలని, మిత్రదేశాలకు అమెరికాకు అండగా నిలవట్లేదని, అమెరికా కూడా ఇకపై వారికి సహాయం చేయడానికి అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు.
బ్రిటన్‌కు చమురు విషయంలో కీలక ఆప్షన్లను ట్రంప్ సూచించారు. ‘‘హార్ముజ్ జలసంధి మూసివేత కారనంగా జెట్ ఇంధనాన్ని పొందలేకపోతున్న దేశాలన్నింటికీ, ముఖ్యంగా ఇరాన్ యుద్ధంలో పాల్గొనేందుకు నిరాకరించిన యూకే వంటి దేశాలకు నా వద్ద ఒక సలహా ఉంది. నంబర్ 1- అమెరికా నుంచి చమురు కొనుగోలు చేయండి, నంబర్ 2- మీలో ధైర్యం ఉంటే హార్ముజ్ జలసంధి నుంచి చమురు తీసుకోండి’’ అంటూ ట్రంప్ రాశారు. మీరు ఎలా పోరాడాలో నేర్చుకోవడం ప్రారంభించాలని, అమెరికా ఇకపై సాయం చేయబోదని స్పష్టం చేశారు. ఇరాన్ దాదాపుగా ఓడిపోతోందని, కష్టమైన పని పూర్తయిందని, వెళ్లి మీ చమురు మీరే తెచ్చుకోండి అని అన్నారు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!