Site icon NTV Telugu

Trump: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌పై కీలక వ్యాఖ్యలు.. చిన్న పిల్లల గొడవలా ఉందని వ్యాఖ్య

Trump

Trump

రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించినా సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రాముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాధినేతలతో చర్చించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అమెరికా విసుగెత్తిపోయింది.

ఇది కూడా చదవండి: Akhil Akkineni: వివాహబంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. ఫొటోలు వైరల్

తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ స్పందిస్తూ.. ఇరు దేశాల యుద్ధాన్ని చిన్న పిల్లల గొడవతో పోల్చారు. రెండు దేశాలు చిన్న పిల్లల్లా కొట్టుకోనివ్వండి అని వ్యాఖ్యానించారు. రక్తపాతాన్ని ఆపగల శక్తి ప్రపంచంలో ట్రంప్‌కే ఉందని జర్మనీ కొత్త ఛాన్సలర్ మెర్జ్ అనడం మంచిదేనని.. అయితే రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలంటే కొంత కాలం రష్యా-ఉక్రెయిన్ పోరాడితేనే మంచిది అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Elon Musk: సెక్స్ స్కామ్ నిందితుడితో ట్రంప్‌‌కు సంబంధాలు.. మస్క్ సంచలన ఆరోపణలు

వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో ట్రంప్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒకరినొకరు ద్వేషించే పిల్లల మధ్య పోరాటంలా ఉందని వ్యాఖ్యానించారు. తాను కూడా పుతిన్‌కు ఫోన్‌ చేసి అదే విషయాన్ని తెలియజేసినట్లు చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని పరిష్కరించడంలో తన పాత్ర పరిమితం అని.. ఇందులో జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ కూడా జోక్యం చేసుకుంటే మంచిదని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా మధ్యవర్తిగా సౌదీ అరేబియాలో రష్యన్ అధికారులతో చర్చలు జరిపారు. అయితే చర్చల సందర్భంగా రష్యా కొన్ని షరతులు పెట్టింది. దీంతో ఈ పంచాయితీ ఎటు తెగకుండా పోయింది. తాజాగా ఇస్తాంబుల్ వేదికగా మరోసారి చర్చలకు సిద్ధపడుతుండగా ఉక్రెయిన్ ఊహించని రీతిలో రష్యాపై డ్రోన్ల దాడికి తెగబడింది. దీంతో ప్రపంచమంతా షాక్‌కు గురైంది. రష్యాకు చెందిన వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున బాంబర్లు నాశనం అయ్యాయి. అయితే ఇప్పటి వరకు రష్యా ప్రతీకార దాడి చేయలేదు.

Exit mobile version