Site icon NTV Telugu

Trump: ఇరాన్‌పై దాడులు సరైనవే.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ మద్దతు

Trump

Trump

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ భీకర దాడులు చేసింది. 24 గంటల వ్యవధిలోనే మరోసారి శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంలో వైమానిక దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఎడతెరిపిలేకుండా దాడులు చేశాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగి ఉంటుందని అంచనా.

ఇది కూడా చదవండి: Israel Strikes: ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..

ఇక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అమెరికా.. ఇజ్రాయెల్‌కు చాలా దగ్గరగా ఉందని.. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ నెంబర్ వన్ మిత్రదేశం అని పేర్కొన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకోని ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు సరైనవే.. న్యూక్లియర్‌ డీల్‌ కోసం ఇరాన్‌కు 60 రోజుల సమయం ఇచ్చాం.. న్యూక్లియర్‌ డీల్‌పై సంతకం చేయకుంటే ఇజ్రాయెల్‌ చేతిలో ఇరాన్‌ నాశనం కావడం ఖాయమని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Air India Crash: విషాదం.. అమ్మకు భోజనం తీసుకెళ్లిన కొడుకు మృతి..

అణు ఒప్పందం గురించి ఇరాన్‌కు దాదాపు 60 రోజులు సమయం ఇచ్చాం.. ఈరోజు 61వ రోజు.. ఇరాన్‌కు దౌత్యం.. సంభాషణల ద్వారా తగినంత సమయం ఇచ్చామని.. అయినా కూడా పట్టించుకోలేదని రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ దాడి చేస్తానంటే మొదట్లో ఆపామని.. కానీ ఇరాన్ తన పరిధి దాటడంతో కష్టాలు కొని తెచ్చుకుందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగడం గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌తో అణు చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను ఇంకా సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఒమన్‌లో జరగనున్న చర్చలకు వాషింగ్టన్ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ చర్చల్లో పాల్గొంటుందనే విషయం తనకు సందేహంగానే ఉందన్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ జూన్ 15న ఇరాన్ ప్రతినిధి బృందాన్ని కలవనున్నట్లు పేర్కొన్నారు. అయినా ఇప్పటికైనా సమయం మంచి పోలేదని.. ఇంకా ఆలస్యం కాకముందే ఇరాన్ ఒప్పందం చేసుకుంటే మంచిది అని హితవు పలికారు. ఇరాన్ ప్రతిదాడుల గురించి స్పందిస్తూ.. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు.

ఇక శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన మొదటి దాడికి ప్రతీకారంగా టెహ్రాన్.. టెల్ అవీవ్‌ వైపు 100 డ్రోన్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైన్యం… డ్రోన్లను అడ్డుకుందని పేర్కొంది. ఇజ్రాయెల్ భూభాగం వెలుపలే వాటిని అడ్డుకున్నట్లు తెలిపింది. ఇక ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు చేదు అనుభవం ఎదురవుతుందని హెచ్చరించారు.

Exit mobile version