ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు దూసుకుపోయాయని తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన భూగర్భ కేంద్రం ఫోర్డోపై అమెరికా ప్రయోగించిన బంకర్-బస్టర్ బాంబులు దూసుకుపోయాయని.. ప్రస్తుతం అక్కడ వేల టన్నుల రాత్రి మాత్రమే మిగిలి ఉందని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ అణ్వాయుధాలను అనుసరించే స్థితిలో లేదని, కనీసం ప్రస్తుతానికైతే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Star Wars : ఆ ఇద్దరి స్టార్స్ మధ్య మరోసారి నువ్వా నేనా.?
ఆపరేషన్ మిడ్నైట్ హామర్‌లో భాగంగా జూన్ 22న ఇరాన్ అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్లను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. భూగర్భ కేంద్రమైన ఫోర్డోపై మాత్రం ప్రత్యేకంగా దాడులు చేసినట్లుగా వివరించారు. ప్రస్తుతానికైతే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవన్నారు. కనీసం కొంత కాలం పాటు వరకైనా ఉండవచ్చి చెప్పారు. ఒకవేళ తిరిగి అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినా.. ఆ ఆలోచన వచ్చినా మరిన్ని దాడులు చేస్తామంటూ టెహ్రాన్‌ను ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Iran: వారిద్దరూ దేవుని శత్రువులు.. ట్రంప్, నెతన్యాహుకు ఇరాన్ మతాధికారి ఫత్వా జారీ
ఫోర్డో కేంద్రం.. పర్వతాలలో లోతుగా ఉంటుంది. ఇక్కడే ఇరాన్ అణ్వాయుధాలు ఉన్నాయి. దీన్ని ధ్వంసం చేయాలంటే చాలా శక్తివంతమైన బాంబర్లు ఉండాలి. అందుకే అమెరికా GBU-57A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్ (MOP)లు అమర్చిన కనీసం ఏడు B-2 స్టెల్త్ బాంబర్లను ప్రయోగించింది. ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబర్లు. కనీసం ఏడు బాంబర్లు ప్రయోగించడంతో ఫోర్డో కేంద్రం ధ్వంసం అయింది.
జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అంతేకాకుండా ఇరాన్ కమాండర్లు సహా అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అమెరికా కూడా రంగంలోకి దిగింది. అణు స్థావరాలే లక్ష్యంగా శక్తివంతమైన బాంబర్లను ప్రయోగించింది. యుద్ధ తీవ్రత ఎక్కువ అవుతున్న సమయంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటించారు. అనంతరం ఇరాన్, ఇజ్రాయెల్ కూడా అధికారికంగా ప్రకటించాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొంది.