Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Hormuz Blockade Iran Nuclear Deal Global Oil Crisis

Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన

Published Date :April 30, 2026 , 7:21 am
By Suresh Maddala
  • హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం
  • ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్‌లు
  • ప్రపంచ దేశాలు ఆందోళన
Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్ మోగబోతున్నాయా? ఇరాన్ మరింత ఉక్కిరిబిక్కిరి కాబోతుందా?. చమురు, గ్యాస్ కష్టాలు మరింత తీవ్రం కాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా హార్ముజ్‌పై ట్రంప్ డెడ్‌లాక్ విధించారు. దీంతో పరిస్థితులు మరింత సంక్షోభం దిశగా వెళ్తొచ్చని సంకేతాలు వెళ్తున్నాయి.

తాజాగా ట్రంప్ మాట్లాడుతూ హార్ముజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునేంత వరకు హార్ముజ్ జలసంధిపై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయబోమని తేల్చి చెప్పారు. ముందు దిగ్బంధం ఎత్తేస్తేనే అణు ఒప్పందంపై చర్చిస్తామన్న ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ ముందు తగిన విధంగా అణు ఒప్పందం చేసుకుంటనే దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని.. లేదంటే దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.

Also Read

  • Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
  • Donald Trump: ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
  • Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్‌తో మనం పోల్చుకోలేము

తాజా దిగ్బంధం బాంబు దాడుల కంటే మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. ఇరాన్ పరిస్థితి ప్రస్తుతం తీవ్రంగా ఉందని.. వారు పూర్తిగా ఒత్తిడిలో ఉన్నారని.. వారికి ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండకూడదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

పోస్ట్ వైరల్
ఇక ట్రంప్ తన సోషల్ మీడియాలో ఏఐతో రూపొందించిన చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ఆయుధంతో కనిపించారు. నల్ల సూటు ధరించి.. కళ్ళద్దాలు పెట్టుకుని.. చేతిలో అసాల్ట్ రైఫిల్ పట్టుకున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ చిత్రానికి క్యాప్షన్‌లో.. ‘‘ఇరాన్ సరిగ్గా ప్రవర్తించలేకపోతోంది. అణ్వాయుధ రహిత ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో వారికి తెలియదు. వారు త్వరగా బుద్ధి తెచ్చుకోవాలి! ఇకపై నేను మంచివాడిని కాను!.’’ అని రాసుకొచ్చారు.

సైనిక హెచ్చరిక
దిగ్బంధమే ప్రధాన ఒత్తిడి సాధనంగా ఉన్నప్పటికీ.. అవసరమైతే సైనిక చర్యకు కూడా సిద్ధమని ట్రంప్ సూచించారు. ఇరాన్ చమురు ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో పైప్‌లైన్లు కూడా ప్రమాదంలో ఉన్నాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

ఇరాన్ ప్రతిస్పందన
అమెరికా చర్యలకు ఇరాన్ భద్రతా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ‘‘దిగ్బంధం కొనసాగితే మేము అనూహ్యమైన చర్యలు తీసుకుంటాం.’’ అని హెచ్చరించాయి. దౌత్యానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సహనానికి కూడా పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశాయి.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దాదాపు రెండు నెలల నుంచి ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇరాన్ అణు ఒప్పందం చేసుకోకపోవడంతో అమెరికా హార్ముజ్‌ను దిగ్బంధించింది. దీంతో చమురు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే ఆయా దేశాల్లో సంక్షోభం నెలకొంది. తాజాగా ఆ దిగ్బంధాన్ని మరింత తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump
  • geopolitical tensions 2026
  • global energy crisis
  • Global Oil Crisis
  • Hormuz crisis news

తాజావార్తలు

  • Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్‌రైజర్స్

  • Astrology: ఏప్రిల్‌ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions