Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explainer: తనను తాను ఒక గ్రేట్ లీడర్‌గా.. ప్రపంచాన్ని శాసించే మేధావిగా చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్‌కు బ్యాడ్ డేస్ మొదలైనట్టే కనిపిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ఇంటాబయట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై కాలుదువ్వి యుద్ధం వరకు తీసుకురావడంతో అంతర్జాతీయ సమాజం ఆయనపై దుమ్మెత్తిపోస్తోంది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ యాటిట్యూడ్స్ సర్వే 2026లో ట్రంప్‌పై జనాలకు ఎంత కోపముందో బయటపడింది. అమెరికాలోనే కాదు.. మొత్తం 36 దేశాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించి ట్రంప్ బండారాన్ని ప్రజల ముందుంచింది.
ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ఏం చెబుతోంది?
ట్రంప్ క్రేజ్ అంతర్జాతీయంగా వేగంగా పడిపోతోందా? డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మసకబారుస్తున్నాయా? ప్రముఖ ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ యాటిట్యూడ్స్ సర్వే 2026 నివేదిక చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేవుడు సృష్టించిన ప్రెసిడెంట్లలో తానే అత్యధికంగా ఉద్యోగాలు కల్పించగల వ్యక్తినని గతంలో ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే ప్రపంచ దేశాల ప్రజలు ఆయనను ఆ విధంగా చూడటం లేదు. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం అంతర్జాతీయంగా ఎదురవుతున్న పెద్ద పెద్ద సమస్యలను డొనాల్డ్ ట్రంప్ డీల్ చేస్తున్న విధానంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ట్రంప్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ట్రంప్ విదేశాంగ విధానాల్లో ముఖ్యంగా టారిఫ్‌లు అంటే అంతర్జాతీయ సుంకాల విధింపుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 77 శాతం మంది ట్రంప్ సుంకాల విధానాన్ని వ్యతిరేకించగా, కేవలం 18 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. ఇజ్రాయెల్ – గాజా యుద్ధాన్ని ట్రంప్ హ్యాండిల్ చేస్తున్న తీరుపై కూడా 76 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇరాన్‌తో అమెరికా సంబంధాలను నడుపుతున్న విధానాన్ని 74 శాతం మంది తప్పుబట్టారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాలు కూడా తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఈ యుద్ధం విషయంలో 72 శాతం మంది ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తే… కేవలం 20 శాతం మంది మాత్రమే ఆయనను సమర్థించారు.
Also Read
- Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
- ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
- Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
- Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రంప్‌పై ప్రపంచదేశాలకు నమ్మకం పోతోందా?
ప్రపంచ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారనే విషయంలో డొనాల్డ్ ట్రంప్‌పై నమ్మకం ఉన్న వారి సంఖ్య చాలా దేశాల్లో భారీగా పడిపోయింది. ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌పై విశ్వసనీయత దారుణంగా క్షీణించింది. సర్వే చేసిన 36 దేశాలలో ఒక్క దేశంలో కూడా ట్రంప్ పట్ల సానుకూలత పెరగకపోవడం గమనించాల్సిన విషయం. చాలా దేశాల్లో ట్రంప్ గ్రాఫ్ నిరంతరం కిందికి జారిపోతోంది. ఈ పరిస్థితి కేవలం ట్రంప్ వ్యక్తిగత ఇమేజ్ను మాత్రమే కాకుండా అమెరికా ప్రతిష్టను కూడా దెబ్బతీస్తోంది. అంతర్జాతీయంగా అమెరికాను ఒక నమ్మకమైన లీడర్‌గా చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఈ సర్వే హెచ్చరిస్తోంది.
ఈ సర్వే ఫలితాలు అంతర్జాతీయంగా అమెరికా పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని కూడా మార్చేస్తున్నాయి. గత సంవత్సర కాలంలో అనేక దేశాల్లో అమెరికాపై ఉన్న మంచి అభిప్రాయం వేగంగా పడిపోయింది. గ్లోబల్ శాంతి, స్థిరత్వానికి వాషింగ్టన్ ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుందని భావించే వారి సంఖ్య బాగా తగ్గింది. ఇతర దేశాల ప్రయోజనాలను, ప్రయోజనకరమైన అంశాలను అమెరికా తన విదేశాంగ విధానాల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కేవలం స్వప్రయోజనాల కోసమే అమెరికా నిర్ణయాలు ఉంటాయనే అభిప్రాయం బలపడుతోంది. ఈ ధోరణి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ కూటములపై, అమెరికా బంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ కొన్ని దేశాలు మాత్రం ఆయనకు గట్టిగా మద్దతు ఇస్తున్నాయి. ఫిలిప్పీన్స్ దేశంలో అత్యధికంగా 68 శాతం మంది ప్రజలు ట్రంప్ నాయకత్వంపై నమ్మకం వ్యక్తపరిచారు. ఇజ్రాయెల్‌లో కూడా ట్రంప్ లీడర్షిప్కు 66 శాతం మంది మద్దతు లభించింది. ఇజ్రాయెల్ దేశానికి ట్రంప్ ఇస్తున్న ప్రాధాన్యత అక్కడ సానుకూలతకు కారణమైంది. దీనికి పూర్తిగా భిన్నంగా వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం ప్రాంతాల్లో ట్రంప్‌పై నమ్మకం కేవలం 4 శాతంగా నమోదైంది. టర్కీ దేశంలో కూడా ట్రంప్ వైఖరిని కేవలం 6 శాతం మంది మాత్రమే విశ్వసించారు. ఈ భిన్నమైన గణాంకాలు ట్రంప్ విధానాలు ప్రపంచాన్ని ఏ విధంగా విడదీస్తున్నాయో స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్‌తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!