Site icon NTV Telugu

Trump: నువ్వో చెత్త రిపోర్టర్‌వి.. ముఖంలో స్మైలే లేదు.. మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ ఫైర్

Trump2

Trump2

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఎప్‌స్టీన్ తాజా ఫైల్‌పై ప్రశ్నలు సంధించిన మహిళా జర్నలిస్ట్‌పై తనదైన శైలిలో ట్రంప్ విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో రుసరుసలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓవల్ కార్యాలయం ఒక్కసారిగా హీటెక్కింది. ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతుండగా.. సీఎన్ఎన్ మహిళా రిపోర్టర్ కైట్లాన్ కాలిన్స్ జోక్యం చేసుకుని తాజాగా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీస్ సెక్స్ స్కామ్‌ ఫైల్‌పై ప్రశ్నలు సంధించింది. ఎప్‌స్టీన్ ఫైల్ విడుదలయ్యాక చాలా మంది బాధిత మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. మొత్తం సాక్షుల ఇంటర్వ్యూలు తొలగింపబడ్డాయని.. న్యాయం జరగలేదని భావించే మహిళలకు ఏం చెబుతారని నిలదీసింది. దీంతో ఒక్కసారిగా ట్రంప్ రిపోర్టర్‌పై మండిపడ్డారు. ‘‘నా గురించి ఏమీ బయటకు రాలేదు కాబట్టి.. దేశం వేరే దాన్ని గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నా. ఎప్‌స్టీన్, ఇతర వ్యక్తులు నాపై చేసిన కుట్ర తప్ప.. ఏమీ లేదు.’’ అని ట్రంప్ మేటర్‌ను పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు.

కానీ రిపోర్టర్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ట్రంప్ సమాధానానికి రిపోర్టర్ కైట్లాన్ కాలిన్స్ కౌంటర్‌గా మరో ప్రశ్న వేసింది. దీంతో ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆమెపై ఫైరయ్యారు. ‘‘నువ్వో చెత్త రిపోర్టర్‌వి. నీలాంటి వాళ్ల వల్లే సీఎన్ఎన్‌కి రేటింగ్స్‌ కూడా లేవు. నువ్వు నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. 10 సంవత్సరాలుగా నీ ముఖంలో చిరునవ్వు నేను ఎప్పుడూ చూడలేదు. అయినా నువ్వు ఎందుకు నవ్వడం లేదో నీకు తెలుసా. ఎందుకంటే నువ్వు నిజం చెప్పడం లేదని నీకు తెలుసు.’’ అంటూ ధ్వజమెత్తారు. అదే స్వరాన్ని ట్రంప్ కొనసాగిస్తూ.. ‘‘నువ్వు చాలా చెడ్డదానివి. నీకు తెలుసు. నువ్వు చెత్త రిపోర్టర్‌వి. ఆశ్చర్యపోనవసరం లేదు. నీలాంటి వాళ్లు వల్లే సీఎన్ఎన్‌కి రేటింగ్స్‌ లేదు.’’ అని ట్రంప్ కొనసాగించారు. అంతలోనే ట్రంప్ ప్రెస్‌‌మీట్ వైపు సైగ చేస్తూ ‘‘ఆమె ఎప్పుడూ నవ్వుదు’’ అంటూ మళ్లీ రిపీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

Exit mobile version