Site icon NTV Telugu

Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. మస్క్ నిర్వహించిన ‘DOGE’ శాఖ మూసివేత

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) శాఖను 8 నెలలకు ముందుగానే క్లోజ్ చేసేశారు. ప్రభుత్వ వ్యవస్థలో మార్పులే లక్ష్యంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ శాఖను ఏర్పాటు చేశారు. దీనికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహించారు. ఈ శాఖ జూలై, 2026 వరకు కొనసాగుతుందని కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం కూడా చేశారు. కానీ అనూహ్యంగా 8 నెలలకు ముందు గానే ఈ శాఖను మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Usha Vance: పెళ్లి ఉంగరం లేకుండా ఈవెంట్‌కు హాజరైన ఉషా వాన్స్.. రేకెత్తుతున్న కొత్త పుకార్లు!

జనవరిలో డోజ్ శాఖను ఏర్పాటు చేశారు. బడ్జెట్‌ను తగ్గించడానికి ఈ శాఖ పని చేస్తుందని అప్పట్లో ట్రంప్ తెలిపారు. దాదాపు పది బిలియన్ డాలర్ల ఖర్చులను కూడా తగ్గించుకున్నట్లుగా డోజ్ శాఖ పేర్కొంది. ఎంతో అర్భాటం ప్రారంభించిన ఈ శాఖను మొత్తానికి నిర్వహించలేక చేతులెత్తేశారు. ప్రస్తుతం డోజ్ శాఖ ఉనికిలో లేదని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ స్కాట్ కుపోర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Spirit : ‘స్పిరిట్’ పూజ కార్యక్రమం ముగిసింది.. ప్రభాస్ లుక్ లీక్ అయింది..?

Exit mobile version