Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
- ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’
- కరోలిన్ లెవిట్ రాజీనామాపై ట్రంప్ చమత్కారం
- కొత్త ప్రెస్ సెక్రటరీ మెక్ఆడమ్స్నా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామాపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. ఆమె తన కంటే తన పిల్లలనే ఎక్కువగా ప్రేమిస్తుందని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ అలెక్సిస్ మెక్‌ఆడమ్స్‌కు తన కొత్త ప్రెస్ సెక్రటరీ పదవిని ఆఫర్ చేశారు.

Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
లెవిట్ రాజీనామా తర్వాత ట్రంప్ కొత్త ప్రెస్ సెక్రటరీ ఎవరు అవుతారనే దానిపై చర్చలు ముమ్మరమయ్యాయి. ఇటీవల ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ అలెక్సిస్ మెక్‌ఆడమ్స్‌కు ఆ పదవిని సరదాగా ఆఫర్ చేశారు.
ఇంటర్వ్యూ సందర్భం జర్నలిస్ట్ మెక్ఆడమ్స్.. కరోలిన్ లెవిట్ స్థానంలో ఎవరైనా రాగలరా అని ట్రంప్‌ను అడిగారు. ట్రంప్ లెవిట్‌ను ప్రశంసించి.. ఆమె స్థానాన్ని భర్తీ చేయడం అత్యంత కష్టమని అన్నారు. ఈ సందర్భంగా రిపోర్టర్‌కు ప్రెస్ సెక్రటరీ పదవిని ఆఫర్ చేశారు. లెవిట్ నిష్క్రమణ తర్వాత వైట్ హౌస్ పోడియంపై ఎవరిని చూడాలనుకుంటున్నారని మెక్ఆడమ్స్ అడిగినప్పుడు.. ట్రంప్ వెంటనే ఆమె వైపు చూపించారు. ‘‘నువ్వా? మరి నీ సంగతేంటి?’’ అని దగ్గరలో నిలబడి ఉన్న మెక్ఆడమ్స్ పనిని ప్రశంసిస్తూ ట్రంప్ అడిగారు. ‘‘నాకు నువ్వంటే మొదటినుంచీ ఇష్టమే.’’ అని ఆమెతో చెబుతూ ఆ బాధ్యతను చక్కగా నిర్వహించగలదని ట్రంప్ అన్నారు.
కరోలిన్ లెవిట్ 2026 ఆగస్టు నెలాఖరులో తాను పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. 2026 మేలో తన రెండవ బిడ్డకు జన్మనిచ్చి, ప్రసూతి సెలవు తర్వాత జూలైలో తిరిగి విధుల్లో చేరారు. అయితే ఆమె ఇప్పుడు తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్ ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా ఆమె తన ముఖ్య బయటి సలహాదారులలో ఒకరిగా కొనసాగుతారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!