Trump: ప్రజా ఉద్యమంతో ఇరాన్ అట్టుడుకుతోంది. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని ప్రావిన్సుల్లో ప్రజాందోళన ఎగిసిపడుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే, ఈ అల్లర్లలో మృతుల సంఖ్య 500లను దాటినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఆందోళనకారుల్ని అణిచివేయాలని ప్రయత్నిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
Read Also: Karan Johar : మా అమ్మ నన్ను లావుగా ఉన్నావని అనేది.. బరువు తగ్గడంపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు.!
తాజాగా, ఇరాన్‌కు షాకిచ్చారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌పై యూఎస్ సైనిక చర్యకు దిగుతుందని అంతా భావిస్తున్న సమయంలో ఈ టారిఫ్స్ నిర్ణయం వచ్చింది. సుంకాలు తక్షణమే అమలులోకి వస్తాయని చెప్పారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా తమకు 25 శాతం సుంకం చెల్లించాల్సిందే అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములైన చైనా, టర్కీ, యూఏఈ, ఇరాక్‌లు ప్రధానంగా సుంకాల బారిన పడే అవకాశం ఉంది.
