Epstein Files: మరో ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల.. ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు!
- మరో ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల
- 30,000 పత్రాలను విడుదల చేసిన న్యాయశాఖ
- ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు!
- అబ్బే.. అదేమీ లేదంటున్న ట్రంప్ వర్గం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో క్రిస్మస్ సమయంలో ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల కాకరేపుతోంది. గత వారం కొన్ని ఫైల్స్ విడుదల చేసిన న్యాయశాఖ.. తాజాగా మరో కొన్ని పత్రాలను విడుదల చేసింది. అయితే ఈ కొత్త ఫైల్స్‌లో అధ్యక్షుడు ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను మాత్రం న్యాయశాఖ తోసిపుచ్చింది.
ఇది కూడా చదవండి: Turkey: టర్కీలో విమాన ప్రమాదం.. లిబియా ఆర్మీ చీఫ్ దుర్మరణం
Also Read
- US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
న్యాయశాఖ సెన్సార్ చేయని కొత్త ఫైల్‌లో ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక మహిళపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ 2020 నాటి ఎఫ్‌బీఐ ఇన్‌టేక్ ఫారమ్ బహిర్గతం అయింది. ట్రంప్ అత్యాచారం చేశాడని.. ఎప్‌స్టీన్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ఫైల్‌లో పేర్కొనబడి ఉంది. ఒక మహిళ చేసిన ఆరోపణ పొందపరచబడింది. 1997లో హై-ఎండ్ హోటల్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు చేసిన మహిళ వయసు, గుర్తింపు అస్పష్టంగా కనిపించింది. దీనిపై సరైన దర్యాప్తు జరగలేనట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ-మెయిల్..
ఇక 1990లో ట్రంప్-ఎప్‌స్టీన్‌తో జెట్ రైడ్‌లు చేశారని.. 1993-1996 మధ్య ఎనిమిది ట్రిప్పులు చేసినట్లుగా విమాన లాగ్‌లు ధృవీకరించాయి. ఇక గుర్తు తెలియని ఫెడరల్ ప్రాసిక్యూటర్ నుంచి వచ్చిన ఈ-మెయిల్ ఆధారంగా 1995లో ట్రంప్‌ను ఒక డ్రైవర్ విమానాశ్రయానికి తీసుకెళ్లాడని.. ట్రంప్ పదే పదే ‘జెఫ్రీ’ అని ఉచ్చరించాడని.. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్లుగా ఒక ఫోన్ కాల్‌ను డ్రైవర్ విన్నాడని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళను డ్రైవర్ తర్వాత కలుసుకున్నాడని.. తీరా చూస్తే డ్రైవర్ జనవరి, 2000లో ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫైల్‌కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

తాజాగా మంగళవారం దాదాపు 30,000 పత్రాలను న్యాయశాఖ విడుదల చేసింది. రాబోయే వారాల్లో లక్షలాది పత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ట్రంప్‌పై వస్తున్న అత్యాచార ఆరోపణలను న్యాయశాఖతో పాటు ట్రంప్ వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. ట్రంప్‌ను అధికారికంగా ఎప్పుడూ విచారించలేదని.. అత్యాచార ఆరోపణలు అవాస్తం అని న్యాయశాఖ పేర్కొంది.

The Department of Justice has officially released nearly 30,000 more pages of documents related to Jeffrey Epstein.
Some of these documents contain untrue and sensationalist claims made against President Trump that were submitted to the FBI right before the 2020 election. To be…
— U.S. Department of Justice (@TheJusticeDept) December 23, 2025
తాజావార్తలు
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!