NTV Telugu Site icon

Bangladeshi PM Reaches India: అగర్తలకు చేరుకున్న షేక్ హసీన.. నిర్ధారించిన త్రిపుర పోలీసులు

Shaik Haseena

Shaik Haseena

Bangladeshi PM Reaches India: బంగ్లాదేశ్‌లో ఇవాళ పరిస్థితి అదుపు తప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్ర రూపం దాల్చడంతో.. వేలాది మంది నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్‌ హసీనా రిజైన్ చేశారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్‌లో బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌ చేరుకున్నట్లు సమాచారం.

Read Also: Kumaradevam Movies Tree : 300 సినిమాల్లో కనిపించిన చెట్టు ఇక లేదు

కాగా, తాజా సమాచారం ప్రకారం.. సోదరి షేక్ రెహానాతో కలిసి షేక్‌ హసీనా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో ల్యాండ్‌ అయినట్లు తెలుస్తుంది. హసీనా రాకను త్రిపుర పోలీసులు నిర్ధారించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. బంగ్లాదేశ్ లో ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని ఢాకాలోని ప్యాలెస్‌ నుంచి ఆమె మధ్యాహ్నం 2: 30 గంటలకు ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి.. తాజాగా అగర్తలలో ల్యాండ్‌ అయినట్లు త్రిపుర పోలీసులు కన్ఫామ్ చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

Read Also: Bangladesh Crisis: బంగ్లాదేశ్లో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్-బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్..!

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో లా అండ్‌ ఆర్డర్‌ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ ప్రకటించారు. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయడంతో.. దేశాన్ని తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుంది అన్నారు. త్వరలోనే దేశంలో తిరిగి శాంతిని నెలకొల్పుతామన్నారు. దేశ పౌరులు సంయమనం పాటించాలి.. సంక్షోభానికి పరిష్కారం కనుగొంటాం.. విద్యార్థులు నిరసనలు ఆపేయాలని కోరుతున్నామని బంగ్లా ఆర్మీ చీఫ్‌ వాకర్‌-ఉజ్‌-జమాన్‌ వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొనింది.

Show comments