Trans Flight Attendant Famed For United Airlines Ad Found Dead After Emotional Social Media Post: కైలీ స్కాట్.. ట్రాన్స్‌జెండర్ అయిన ఈమె ఒక ఫ్లైట్ అటెండెంట్. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించడంతో పాటు ట్రాన్స్‌జెండర్స్‌కి ఆదర్శంగా నిలిచింది. అలాంటి కైలీ ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్టు పెట్టి మరీ తన ప్రాణాలు తీసుకుంది. కొలరాడోలోని తన ఇంట్లోనే గత సోమవారం బలవన్మరణానికి పాల్పడింది. తాను సూసైడ్ చేసుకోవడానికి ముందు.. తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో స్నేహితులు, కుటుంబసభ్యులను ఉద్దేశించి ‘మనం పంచుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలి’ అంటూ పోస్ట్ పెట్టింది.
Honey Rose: జిస్మత్ జైల్ మండిలో ‘వీరసింహారెడ్డి’ భామ!
‘‘నేను నా తుదిశ్వాస తీసుకుంటూ ఈ భూమి నుంచి నిష్క్రమిస్తున్న తరుణంలో.. ప్రతిఒక్కరికీ క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. నన్ను నేను ఉత్తమంగా మార్చుకోలేనందుకు నన్ను క్షమించండి. నేనంతో ఇష్టపడే వారికి.. నేను ధైర్యంగా ఉండలేకపోయినందుకు నన్ను మన్నించండి. నా కోసం ఎన్నో ఇచ్చిన, ఎంతో చేసిన వారికి.. నేను చేసిన ప్రయత్నం ఫలించనందుకు నన్ను క్షమించండి. నా మరణానికి మీరెవరూ బాధ్యులు కారు. నన్ను నేను ఉత్తమంగా మలచుకోలేక పోతున్నందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీ మంచి జ్ఞాపకాల్లో నన్ను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారని నేను కోరుకుంటున్నా. మీతో త్వరలోనే మరో ప్రపంచంలో కలుసుకుంటా. బ్రియానా.. నేనొస్తున్నా’’ అంటూ కైలీ స్కాట్ తన పోస్టులో రాసుకొచ్చింది. కైలీ స్కాట్ మరణ వార్తను ఆమె తల్లి ఆండ్రియా సిల్వెస్ట్రో ధృవీకరించారు.
Rishabh Pant: రిషభ్ పంత్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన గౌరవం
తన కూతురు ఇలా వదిలివెళ్లిపోవడంతో.. ఆండ్రియా కూడా ఫేస్‌బుక్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘‘కైలీ.. నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా. నీ నవ్వు చాలా అందంగా ఉండేది. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది” అంటూ రాసుకొచ్చారు. ఇదిలావుండగా.. కైలీ స్కాట్ మృతికి గల కారణాలేంటో ఇంతవరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలోనే.. స్కాట్ మరణంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. స్కాట్ మరణవార్త తెలిసి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.