Mexico Train Accident: మెక్సికోలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి
- మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం
- పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి
- 100 మందికి పైగా గాయాలు
దక్షిణ మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: US: గగనతలంలో ప్రమాదం.. 2 హెలికాప్టర్లు ఢీ.. వీడియో వైరల్
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన ఓక్సాకాలో ఆదివారం ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా పేర్కొన్నారు. రైల్లో తొమ్మిది మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులు సహా దాదాపు 250 మంది ఉన్నారని మెక్సికన్ నేవీ తెలిపింది. 193 మంది ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. తొంభై ఎనిమిది మంది గాయపడ్డారని, 36 మంది వైద్య చికిత్స పొందుతున్నారని నేవీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Trump-Zelensky: ట్రంప్-జెలెన్‌స్కీ భేటీ.. చివరికి ఏం తేలిందంటే..!
పట్టాలు తప్పడానికి గల కారణాలు వెల్లడి కాలేదు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. ఇక గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి సీనియర్ ప్రభుత్వ అధికారులను సంఘటనా స్థలానికి పంపినట్లు అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.
BREAKING: 13 killed, 98 injured after Interoceánico train derails in Istmo de Tehuantepec, Oaxaca, Mexico pic.twitter.com/gWKfnRO0aP
— Rapid Report (@RapidReport2025) December 29, 2025
తాజావార్తలు
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!