World Tigers Day: నేడు ప్రపంచ పులుల దినోత్సవం.. పూరీ తీరంలో 15 అడుగుల సైకత చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Tigers Day: ఒక్కో రోజుకు ఒక్కో దినోత్సవంతో వేడుకలను చేస్తున్నారు. అందులో బాగంగా నేడు ప్రపంచ పులుల దినోత్సవం. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా పులులను రక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ పర్యావర్ణ వేత్తలు చెబుతున్నారు. సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా ఇసుకతో చిత్రాలను రూపొందిస్తూ అందరినీ ఆలోచింప చేసే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో 15 అడుగుల ఎత్తున్న పులి బొమ్మను రూపొందించారు. తల్లి పులి తన పిల్లను ప్రేమతో నిమురుతున్నట్లుగా ఈ చిత్రాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అడవుల్లో ఉండే తమను రక్షించండి (Save Us to Save the Environment) అంటూ జనారణ్యంలో ఉండే జనాలకు పులులు చెబుతున్నట్లుగా ఈ సైకత శిల్పాన్ని ఆయన చెక్కారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్న పులుల జనాభా క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో పులులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 2010 నుంచి ప్రతిఏటా జూలై 29ని ప్రపంచ పులులు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
Read also: Business Idea: మహిళలకు అదిరిపోయే బిజినెస్.. ఇంట్లో నుంచి లక్షలు సంపాధించవచ్చు..
Also Read
ప్రపంచంలో సుమారు 5 వేల పులులు ఉంటే ఒక్క భారత్‌లో 3 వేలకుపైగా ఉండటం విశేషం. అడవి పులులు అత్యధికంగా ఉన్నది కూడా మన దేశంలోనే కావడం గమనార్హం. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో 2006 నుంచి పులుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తున్నది. 2006 ఏడాదిలో 1,411గా ఉన్న పులుల సంఖ్య.. 2010 నాటికి 1,706కు చేరింది. 2014లో 2,226కి చేరగా.. 2019లో 2,967, 2023 వచ్చేసరికి పులుల సంఖ్య 3,167కు పెరిగింది. దేశంలో ప్రతి పదేళ్లకు జనాభా లెక్కిస్తున్నట్టే.. ప్రతి నాలుగేండ్లకు పులుల జనాభాను లెక్కిస్తారు. భారత్ తర్వాత రష్యాలో అత్యధికంగా 540 పులులు ఉన్నాయి. ఇండోనేషియాలో 500, నేపాల్‌లో 355, థాయిలాండ్‌లో 189, మలేషియాలో 150 చొప్పున ఉన్నాయి. ఇక మన పొరుగు దేశం చైనాలో 50 మాత్రమే ఉండగా, మయన్మార్‌లో 22, వియత్నాంలో 5, లావోస్‌లో 2 పులులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
#WATCH | Odisha: Sand artist Sudarsan Pattnaik created a 15-foot tall tiger on the occasion of World Tiger Day, in Puri. (28.07) pic.twitter.com/XJDCR2Iaf9
— ANI (@ANI) July 29, 2023
తాజావార్తలు
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!