బైక్‌పై వెళ్లే సమయంలో హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుంది. ఖరీదైన హెల్మెట్ అంటే కనీసం 10వేల వరకు ఉంటుంది. కానీ, ఈ హెల్మెట్ ధర మాత్రం ఏకంగా రూ.35 లక్షలపైమాటే. ఎందుకు అంత ఖరీదు… ఆ హెల్మెట్ స్పెషాలిటి ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హెల్మెట్‌లో సెన్సార్లు ఉంటాయి. ఇవి మీ మెదడును చదివేస్తాయి.
Read: వరంగల్ ఐటి పార్కు : 1,350 మందికి ఉద్యోగాలు..
అంతేకాదు, ఈ హెల్మెట్ మెదడులోని విద్యత్ ప్రకంపనలను, రక్తప్రవాహాన్ని వాయువేగంతో కొలవడంతో పాటుగా విశ్లేషిస్తుంది. కెర్నల్ కంపెనీ ఈ రకం హెల్మెట్‌ను తయారు చేసింది. ఈ హెల్మెట్‌ను ఎవరైనా ధరించవచ్చు. దాదాపుగా ఐదేళ్లపాటు శ్రమించి ఈ హెల్మెట్‌ను తయారుచేశారు. అమెరికాలో త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది.