NTV Telugu Site icon

Israel-Hamas war: అల్-షిఫా ఆసుపత్రి పై ఇజ్రాయిల్ దాడి.. దక్షిణ గాజాకు క్షతగాత్రులు

Untitled 19

Untitled 19

Al-Shifa Hospital: హమాస్ గాజా లోని అల్-షిఫా ఆసుపత్రిని తన యుద్ధ కార్యాకలాపాలకు వినియోగిస్తున్నదని..అలానే బంధించిన 250 మంది ఇజ్రాయిల్ పౌరులను ఆసుపత్రి లోనే దాచిందని.. ఇజ్రాయిల్ ఓ వీడియో క్లిప్ ని విడుదల చేసింది. అలానే ఆస్పుపత్రి పైన దాడి చేసింది. ఈ దాడిలో వందల మంది గాయపడ్డారు. వివరాలలోకి వెళ్తే.. బుధవారం ఇజ్రాయిల్ గాజా లోని అల్-షిఫా ఆసుపత్రి పై దాడి చేసింది. ఈ దాడుల్లో 19 మంది వైద్య సిబ్బందితో పాటు 259 మంది గ్యాపడ్డారు. గాయపడిన వారిని దక్షణ గాజాకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ అల్-షిఫా ఆసుపత్రి పై చేసిన దాడుల్లో వందలమంది గాయపడ్డారని.. కాగా ప్రస్తుతం గాయపడిన వారిని దక్షణ గాజా స్ట్రిప్‌ లోని ఖాన్ యునిస్‌ లోని యూరోపియన్ ఆసుపత్రికి తరలిస్తున్నామని.. ఈ క్రమంలో 14 అంబులెన్స్‌లు ఆసుపత్రికి వచ్చాయని పేర్కొంది.

Read also:Manchu Vishnu: కన్నప్ప… కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అయ్యేలా ఉందే

అలానే ప్రస్తుతం ఆసుపత్రిలో నీటి కొరత, విద్యుత్ కొరత తో పాటుగా వైద్య సామగ్రి కూడా లేనట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధ బేరి మోగి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. అయినా నేటికీ యుద్ధ జ్వాలలు ఎగసిపడుతన్నాయి. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన చేసిన ఆకస్మిక దాడిలో 1400 మందికి పైగా చనిపోయారు. అలానే 250 మంది ఇజ్రాయిల్ పౌరులను హమాస్ ఉగ్రవాదువులు బంధించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇజ్రాయిల్ హమాస్ పరిపాలనలో ఉన్న గాజాపై చేస్తున్న దాడుల్లో ఇప్పటికే 13 వేల మందికి పైగా మరణించారు.